Movies"ఆ మూడ్ నాకు లేదు.. దాని వరకు అయితే ఓకే".. హనీ...

“ఆ మూడ్ నాకు లేదు.. దాని వరకు అయితే ఓకే”.. హనీ రోజ్ బోల్డ్ మాటలకు మగాళ్ల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ బ్యూటీ హనీ రోజు పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిజానికి హనీ రోజ్ 2005 లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది . అయితే అమ్ముడు పేరు ఇప్పుడు ఇంతలా పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం మాత్రం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా అనే చెప్పాలి . కాగా మలయాళీ నటి అయిన హనీ రోజ్ ఫస్ట్ తెలుగులో ఆలయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో అసలు అమ్మడు పేరే జనాలకి తెలియకుండా పోయింది .

ఆ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది . ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో హనీరోజ్ కెరియర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇలా రెండు సినిమాలు డిజాస్టర్ అవడంతో తెలుగులో కెరియర్ లేదనుకున్న హనీ రోజ్ కు పిలిచి అవకాశం ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ . రీసెంట్గా ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ మరదలు పాత్రలో నటించి సూపర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కన్నా హని రోజే ఎక్కువ అభిమానులు సంపాదించుకుంది అనడంలో సందేహం లేదు .

ఒక సినిమా హిట్ కొట్టేసరికి తెలుగులో అమ్మడి పేరు మారు మ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే వరుస సినిమాలకు పలు ఈవెంట్స్ కు.. షాప్ ఓపెనింగ్ ఫంక్షన్ లకు అటెండ్ అవుతూ హంగామా చేస్తుంది . రీసెంట్గా హైదరాబాద్లో ఓ జైల్ మండిను ఓపెన్ చేసిన హనీ రోజ్.. కాసేపు మీడియాతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చింది . ఈ క్రమంలోనే ఓ ప్రతినిధి పెళ్లిపై ప్రశ్నించగా..” నాకు పెళ్లి చేసుకునే మూడ్ లేదని “ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

అంతేకాదు సినిమాల్లో నేను సాధించాల్సింది చాలా ఉందని ..అప్పుడే ఈ పెళ్లి అంటూ కమిట్మెంట్స్ ఇవ్వలేనని చెప్పుకు వచ్చింది . అంతేకాదు ప్రేమిస్తాను అది ఎంత దూరమైన ప్రేమిస్తాను ..సినిమాలపరంగా.. ఫ్రెండ్షిప్ పరంగా.. నటనపరంగా అంతే.. అంతకుమించి హద్దులు మీరను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే హనీ రోజ్ మగాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసింది . తనకున్న కమిట్మెంట్స్ ఎంత క్లియర్ గా చెప్పిందంటే మగాళ్లు సైతం ఆమె ఆలోచనలకు మెల్ట్ అయిపోయేలా ఉన్నాయి అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . ఏ మాటక ఆ మాట ఈ మలయాళ బ్యూటీ పక్క టైమింగ్స్ మన తెలుగు హీరోలు కూడా ఫిదా అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news