Moviesబాల‌య్య కధను దొబ్బేసిన ర‌వితేజ‌.. ఇంత చీటింగా..?

బాల‌య్య కధను దొబ్బేసిన ర‌వితేజ‌.. ఇంత చీటింగా..?

అదేంటి బాలయ్య డైరెక్టర్ ను రవితేజ లాగేసుకోవడం ఏంటని.. చూస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య, రవితేజ ఇద్దరు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇద్దరికీ వరుస పెట్టి హిట్లు వస్తున్నాయి. బాలయ్య అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరసింహారెడ్డి తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా బాలయ్య లైనఫ్లో చాలామంది క్రేజీ డైరెక్టర్లు ఉన్నారు. ఇటు రవితేజ డిసెంబర్లో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

త్వరలోనే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా సమ్మర్ తర్వాత రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ వెంటనే రవితేజ లైన్ లో క్రేజీ డైరెక్టర్లు కాచుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న ఒక యంగ్ డైరెక్టర్ పై ఇప్పుడు రవితేజ కన్ను పడినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో రవితేజతో ఒక క్రేజీ ప్రాజెక్టును చేయబోతున్నాడట.

ఇప్పటికే ఈ సినిమా కథపై చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ప్రశాంతవర్మ ఇప్పటికే బాలయ్యకు కూడ‌ ఒక‌ అదిరిపోయే స్టోరీ చెప్పాడు. బాలయ్యకు ప్రశాంత వర్మకు అనుస్టాపబుల్ టాక్ షో లింకు కలిపింది. బాలయ్య అనాస్టాప బుల్ – 2 టీజర్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఆ టీజర్ లో ప్రశాంత్ వర్మ బాలుయను చాలా చక్కగా చూపించాడు. ఆ తర్వాత ఇద్దరికీ మధ్య స్నేహం కూడా కుదిరింది. ఆ సమయంలోనే ప్రశాంత వర్మ బాలయ్యకు ఒక కథ చెప్పగా బాలయ్య ఆసక్తిగా విని చేద్దాం బ్రదర్ అని హామీ ఇచ్చారట.

బాలయ్య ఎవరికైనా హామీ ఇవ్వరు, హామీ ఇస్తే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ – బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సమయంలో.. ఇప్పుడు సడన్ గా రవితేజ ప్రశాంత్ వర్మ సినిమా వస్తుందన్న వార్త ఆసక్తిగా మారింది. మరి ఈ ఇద్దరు హీరోలలో ప్రశాంత్ వర్మ ముందుగా ఎవరితో సినిమా చేస్తారా ? అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news