Moviesపూజా కు అసలు దరిద్రం ఆ సినిమా నుండే పట్టుకుందా..? లాభం...

పూజా కు అసలు దరిద్రం ఆ సినిమా నుండే పట్టుకుందా..? లాభం లేదు ఇక అమ్మడు అది చేయాల్సిందేనా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే కు టైం అసలు బాగోలేదా ..? అంటే అవును అని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు . టాలీవుడ్ జనాలు అదే అంటున్నారు . ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . ఒకప్పుడు పూజ హెగ్డే సినిమా వస్తుంది అంటే మేకర్స్ సైతం కోట్లల్లో లాభాలను ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది . పూజాతో సినిమా అంటేనే భయపడిపోతున్నారు మేకర్స్.

అంతలా తన పేరున డిజాస్టర్ గా మార్చుకోవడానికి కారణం రాధే శ్యామ్ సినిమా అంటున్నారు పూజ ఫ్యాన్స్ . అప్పటివరకు వరస హిట్లు కొట్టిన పూజా హెగ్డే కి ఫస్ట్ డిజాస్టర్ పడింది ఆ సినిమాతోనే. రాధాకృష్ణ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది . టైం ట్రావెల్ కథతో ముందుకెళ్లిన ఈ సినిమాలో పూజ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ సినిమా డిజాస్టర్ గా మారింది .ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో కూడా నానా హంగామా చేశారు టీం.

దీంతో సినిమా డిజాస్టర్ అవడంతో ప్రభాస్ తో పాటు పూజా పేరు కూడా ట్రోల్ అయింది . అయితే ప్రభాస్ తనకున్న క్రేజ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ తో బయటపడగలిగాడు ..పూజ మాత్రమే ఇంకా ఆ సినిమా డిజాస్టర్ లోనే మునిగిపోతుంది . పూజకు అసలు దరిద్రం ఆ సినిమా నుండే పట్టుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పూజ హెగ్డే ఆ బాధ నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని ..మహేష్ బాబు సినిమా హిట్ అయితే పూజ హెగ్డే కెరియర్ మళ్ళీ టర్న్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news