Moviesనయనతారను నమ్మించి చీట్ చేసిన స్టార్ డైరెక్టర్..పేరుతో సహా బయటపెట్టేసిందిగా..!!

నయనతారను నమ్మించి చీట్ చేసిన స్టార్ డైరెక్టర్..పేరుతో సహా బయటపెట్టేసిందిగా..!!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతారను స్టార్ డైరెక్టర్ చీట్ చేశారా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని స్వయాన నయనతారనే ఓ ఇంటర్వ్యూలో చెప్పకు రావడం సంచలనంగా మారింది. మనకు తెలిసిందే నయనతార తన కెరియర్ లో ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేసింది ..ఎన్నో హిట్ సినిమాలు కొట్టింది ..ఎన్నో ఫ్లాప్ సినిమాలు చూసింది ..అయితే నయనతార కెరియర్ లోనే మర్చిపోని డైరెక్టర్ ఎవరు అంటే మురగదాస్ అంటూ చెప్పకు వస్తుంది .

దానికి కారణం ఆయన కథ చెప్పేటప్పుడు ఓ విధంగా చెప్పి తెరకెక్కించేటప్పుడు మరోలా .. తిరిగి ఎడిటింగ్లో సగానికి సగానికి పైగా తన సీన్లు లేపేసాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది . గజినీ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటించింది నయనతార . అప్పట్లోనే ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది ..ప్రాఫిట్స్ అందుకుంది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూసే జనాలు ఉన్నారు .

కాగా ఈ సినిమాలో నయనతారను మెయిన్ హీరోయిన్ అని చెబుతూ సెకండ్ హీరోయిన్గా మార్చేసాడట . అంతేకాదు సీన్స్ లో కూడా చాలా సన్నివేశాలను కట్ చేశాడట.. సూర్యతో నయనతారకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని తీసేసాడని ..మొదటి హీరోయిన్ అని చెప్పి చీట్ చేసాడని చెప్పుకొచ్చింది. ఇలా కథ చెప్పే ముందు ఒకలా చెప్పి సైన్ చేయించుకున్న తర్వాత మరో లా చేయించి .. ఆయన నా నమ్మకాన్ని ఒమ్ము చేశాడు అంటూ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పట్లో ఈ విషయం సెన్సేషనల్ గా మారిపోయింది. ప్రజెంట్ నయనతార తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది..!1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news