Moviesబిగ్ షాకింగ్: నయన్-విగ్నేశ్ ను ఇండస్ట్రీని నుండి బాయ్ కాట్ చేయండి.....

బిగ్ షాకింగ్: నయన్-విగ్నేశ్ ను ఇండస్ట్రీని నుండి బాయ్ కాట్ చేయండి.. బయటపడ్డ భార్యభర్తల గూడుపుటాని..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఆమె భర్త విగ్నేశ్ శివన్.. చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా వర్గాలు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. ఆమె భర్త విగ్నేష్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు . మొదట పెళ్లి విషయంలో.. ఆ తర్వాత దేవుడు సన్నిధిలో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆ తర్వాత బిజినెస్ లో లాస్ రావడం.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది అని వార్తలు రావడం ..ఆ తర్వాత ఏకంగా సరోగసి ప్రాసెస్ ద్వారా ఇల్లీగల్ గా పిల్లలను కనడం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏదో ఒక వివాదంతో నయనతార విగ్నేశ్ శివన్ ల జంట సోషల్ మీడియాలో ..అటు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది .

తాజాగా నయనతారను విగ్నేశ్ శివన్ ని బ్యాన్ చేసే విధంగా ఆలోచిస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. దానికి మెయిన్ రీజన్ నయనతార భర్త లైఫ్ నీ గాడిలో పెట్టడం కోసం పలువురు స్టార్ హీరోస్ తో అమ్మడు రూల్స్ బ్రేక్ చేస్తుందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే విగ్నేశ్ ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న డైరెక్టర్ . నయనతార ఆల్మోస్ట్ హీరోయిన్ గా సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్లో రాజ్యమేలుస్తున్న ముద్దుగుమ్మ . ఈ క్రమంలోనే భర్త కోసం నయనతార తన వద్దకు వస్తున్న భారీ ఆఫర్స్.. వేరే డైరెక్టర్ చేస్తున్న సినిమాలను సైతం క్యాన్సిల్ చేయిచ్చి.. విగ్నేష్ శివన్ కి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

తనకున్న పలుకుబడితో మౌల్డ్ అప్ చేసేసి మభ్యపెట్టేసి మిగతా డైరెక్టర్ జీవితాలను నాశనం చేస్తుందన్న న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని పలువురు స్టార్ డైరెక్టర్ లు నయనతార పద్ధతి మార్చుకోకపోతే విగ్నేశ్ శివన్ ని ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారట . అంతేకాదు ఒకవేళ నయనతార కూడా మాట వినకపోతే నయనతార – విగ్నేశ్ ని ఇద్దరినీ ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారట . దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో నయనతార-విగ్నేశ్ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. చూడాలి మరి నయనతార తన పద్ధతిని ఏ విధంగా మార్చుకుంటుందో ..ఈ రూమర్స్ పై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news