Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్‌పై 2020లో ఆ హీరోయిన్ చెప్పిన జోస్యం నిజ‌మైందిగా...!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై 2020లో ఆ హీరోయిన్ చెప్పిన జోస్యం నిజ‌మైందిగా…!

పాయల్ ఘోష్ అంటే చాలామంది సినిమా అభిమానులకు పెద్దగా తెలియదు. ఆమె బాలీవుడ్ హీరోయిన్. తెలుగులో కూడా చెప్పుకోదగ్గర సంఖ్యలో సినిమాలు చేసింది. అయితే రావాల్సినంత క్రేజ్ రాలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో మాత్రం వార్తల్లో నిలుస్తుంది. 17 ఏళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టింది పాయల్ ఘోష్. షేర్స్ పెరిల్ అనే ఇంగ్లీష్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్.. ఆ మరుసటి ఏడాది తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ప్రయాణం సినిమాలో హీరోయిన్గా నటించింది.

మంచు మనోజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో పాయల్ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమాలో కూడా నటించింది. పటేల్ కీ పంజాబీ షాదీ సినిమాతో బాలీవుడ్ లోనూ మెప్పించింది. ఇక పాయల్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. పాయల్ తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది పాయల్.

జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని ఎన్టీఆర్ గురించి ఎవరు ఏం ? మాట్లాడినా అసలు సహించలేదు. సోషల్ మీడియాలో వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఆమె హ్యాపీ మూమెంట్ అని తెలిపింది. అయితే పాయల్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని 2020లోనే కామెంట్ చేసింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన పాట‌లో నటించాడు.

దీనిపై పాయల్‌ స్పందిస్తూ త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ తాను ముందే అంచనా వేశానని.. తాను ఎప్పుడూ అబద్ధం చెప్పను అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన తారక్‌ అభిమానులు.. అవును పాయల్ నువ్వు చెప్పిందే నిజమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలోనే పాయల్ సూసైడ్ నోట్ కూడా పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఒకవేళ నాకు గుండెపోటు వచ్చినా… ఆత్మహత్య చేసుకుని మరణించిన అందుకు కారణం ఎవరంటే ? అని సగం రాసి ఉన్న పేజీ పోస్ట్ చేసింది.

ఇది చూసిన అభిమానులు ఆమె గురించి ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగింది బాగానే ఉన్నావా ? దయచేసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకో అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇక పాయల్ మీ టు ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుని నిర్మాత అనురాగ్ కాశ్య‌ప్‌పై లైంగిక వేధింపులు.. ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news