Moviesబిగ్ బాస్ 7: కంటెస్టెంట్లకు కొత్త కండీషన్..ఈసారి అలా చేస్తే తాట...

బిగ్ బాస్ 7: కంటెస్టెంట్లకు కొత్త కండీషన్..ఈసారి అలా చేస్తే తాట తీసేస్తారు..!?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ .. ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్లో గ్రాండ్గా లాంఛ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన పనులను బ్యాగ్రౌండ్ లో చకచకా కంప్లీట్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ . ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొనాల్సిన కంటెస్టెంట్ లిస్ట్ ని ఫైనల్ చేశారని .. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న కండల వీరుడు రానా దగ్గుబాటి చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ వన్ ని తారక్ హోస్ట్ చేశారు . సీజన్ 2 ని నాని హోస్ట్ చేశాడు . ఆ తర్వాత నుంచి అన్ని సీజన్లోకి హోస్టుగా చేసింది నాగార్జుననే. ఈ క్రమంలోనే జనాలకు Nagarjuna హోస్టింగ్ బోరింగ్ గా అనిపిస్తుంది. దీంతో హోస్ట్ ని మారిస్తే టిఆర్పి రేటింగ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందట . అంతేకాదు బిగ్ బాస్ సెవెన్ లో ఈసారి టోటల్గా రూల్స్ ని చేంజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అవకాశం వచ్చేవరకు వెయిట్ చేసి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్బాస్ పై సంచలన కామెంట్స్ చేసే వాళ్ళు. బిగ్ బాస్ అంత ఫేక్ అని ముందుగానే టాస్క్ లో ఎవరు గెలవాలో చెప్పేస్తారని ఓపెన్ అప్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ నుంచి మాత్రం ఎవరైనా సరే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత బయటికి వెళ్లి పలు మీడియా ఛానల్స్ కి బిగ్ బాస్ పై నెగిటివ్గా చేస్తే మాత్రం లీగల్గా యాక్షన్స్ తీసుకునే విధంగా అగ్రిమెంట్ రాయిస్తున్నారట .

బిగ్బాస్ హౌస్ లోకి ఎంత మర్యాదపూర్వకంగా వస్తున్నారో .. అంతే మర్యాదపూర్వకంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోవాలని .. ఆ తర్వాత బిగ్బాస్ పై ఎలాంటి చెడు కామెంట్స్ చేయకూడదు అనే విధంగా అగ్రిమెంట్ రాయించుకుంటుందట . ఒకవేళ ఆ రూల్స్ ని ఉల్లంఘన చేస్తే మాత్రం రెమ్యూనరేషన్ మొత్తం తిరిగిచ్చేయాలని .. లీగల్ యాక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని.. అగ్రిమెంట్ రెడీ చేశారట. ఇది తెలుసుకున్న కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. మరి కొంతమంది తొక్క లో రూల్స్ అంటూ కొట్టి పడేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు చుక్కలు చూపించడం కన్ఫామ్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news