Movies' ఆహా ' కోసం బాల‌య్య కొత్త అవ‌తారం… లుక్ అదిరిపోయిందిగా…!

‘ ఆహా ‘ కోసం బాల‌య్య కొత్త అవ‌తారం… లుక్ అదిరిపోయిందిగా…!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్ షోలు.. వాణిజ్య ప్రకటనలు చేస్తూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అసలు అన్ స్టాపబుల్ దెబ్బకు బాలయ్య ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలు మారుమోగుతున్నాయి. అసలు థియేటర్లలో ఏ హీరో సినిమా ఆడుతున్నా కూడా జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలు చేస్తున్నారు.

ఇక ఈ టాక్ షొ చేశాక బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి రెండు సినిమాలు ఎంత ? పెద్ద హిట్ అయ్యాయో చూసాం. వీర సింహారెడ్డి అయితే తొలి రోజు ఏకంగా 54 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాలయ్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఆల్ టైం రికార్డ్ గా నిలిచిపోయింది. ఇక బాలయ్య చేయి పడ్డాక ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదే జోష్‌తో మరోసారి ఆహా బాలయ్యతో మరో ట్విస్ట్ ఇవ్వటానికి సిద్ధమయింది.

ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య గెస్ట్ గా మెరవబోతున్నారు.ఇప్పటికే ఈ కాంపిటేషన్ షో కోసం 12 మంది కంటెస్టెంట్లను ఫైనల్ కూడా చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుంది. మరో విచిత్రం ఏంటంటే ఈ ఎపిసోడ్లో బాలయ్య డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నాడు.

ఈ ఫోటోలను ఆహా ట్వీట్ చేసింది. అసలు బాలయ్య ఫొటోల్లో చాలా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు మనం ఎన్నడూ చూడని సరికొత్త ఎనర్జిటిక్ బాలయ్యలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news