Moviesధనుష్‌- ఐశ్వర్య ల విడాకుల్లో బిగ్ ట్విస్ట్..లాస్ట్ లో కొంప ముంచేసిన...

ధనుష్‌- ఐశ్వర్య ల విడాకుల్లో బిగ్ ట్విస్ట్..లాస్ట్ లో కొంప ముంచేసిన రజినీకాంత్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు .. ఈ మధ్యకాలంలో బ్రేకప్ చెప్పేసుకుని విడాకులు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకరే అందాల ముద్దుగుమ్మ డైరెక్టర్ ఐశ్వర్య- హీరో ధనుష్ . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ధనుష్ని పెళ్లి చేసుకుని 18 ఏళ్ల పాటు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు .

అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ జంట సడన్గా విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ప్రకటించింది . సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న కొన్ని నెలలకే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నాం అని ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే ఆ తర్వాత ఈ జంట మళ్ళీ పిల్లల కోసం కలవబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అయింది . అయితే అదంతా ఫేక్ అని వాళ్ళు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని ..సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.

ఈ క్రమంలోనే రీసెంట్గా వీరిద్దరూ మరోసారి కోర్టు మెట్లు ఎక్కినట్లు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ట్వీట్టర్ ద్వారా సంచలన విషయాలను బయటపెట్టారు . ధనుష్ వేరే అమ్మాయి కోసం ఐశ్వర్య ని చీట్ చేశాడని ..ఈ జంట మరోసారి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారని ఆయన ట్విట్ చేశారు . ఈ క్రమంలోనే మరోసారి ధనుష్- ఐశ్వర్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అంతేకాదు నిన్న మొన్నటి వరకు వీళ్లిద్దరు విడాకులను ఆపడానికి ట్రై చేసిన రజినీకాంత్ ఇప్పుడు ఐశ్వర్య ధనుష్ ల కు విడాకులు ఇప్పించడానికి ట్రై చేస్తున్నారట. దానికి కారణం ధనుష్ పబ్లిక్ గా వేరే అమ్మాయితో తిరగడమే అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ధనుష్ పై గుర్రుగా ఉన్న రజనీకాంత్ కూతురుగా లైఫ్ చక్కదిద్దడానికి ట్రై చేస్తున్నాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news