Moviesబిగ్ బ్రేకింగ్‌: తాను ల‌వ్‌లో ఉన్నాన‌ని క్లారిటీ ఇచ్చేసిన అక్కినేని అఖిల్‌..!

బిగ్ బ్రేకింగ్‌: తాను ల‌వ్‌లో ఉన్నాన‌ని క్లారిటీ ఇచ్చేసిన అక్కినేని అఖిల్‌..!

అక్కినేని నవ మన్మధుడు అఖిల్ ఏజెంట్ సినిమాతో ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మిస్టర్ మజ్ను సినిమా తర్వాత అఖిల్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర్కెక్కుతున్న ఏజెంట్ సినిమాలో అఖిల్ కి జోడిగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్లో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపిస్తున్నాడు. సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.

తనతో పాటు ఆడుతున్న ప్లేయర్స్ అందరూ తనకు చాలా స్నేహితులుగా ఉంటారని.. తన చిన్నప్పుడు స్కూలులో ఒకపక్క క్లాసులు జరుగుతుంటే వెళ్లిపోయి క్రికెట్ ఆడుకునే వాళ్ళమని.. ఇలా చాలాసార్లు దొరికిపోయామ‌ని చెప్పాడు. క్రికెట్ ఆడే క్రమంలో ఎన్నో కిటికీల అద్దాలు కూడా పగలగొట్టాన‌ని చెప్పాడు. ఇక తనకు సోషల్ మీడియా ఎక్కువగా తెలియదని.. సోషల్ మీడియా అంటేనే కొంత బిడియం, భయంతో ఉంటానని.. అందుకే దాని గురించి ఎక్కువగా తెలుసుకోనన్నాడు.

అందులో ఎక్కువగా పోస్టులు పెట్టను అని.. కేవలం తన సినిమాలు గురించి మాత్రమే అప్డేట్లు ఇస్తూ ఉంటానని అఖిల్ చెప్పాడు. అందువల్లే నా అభిమానులను నేను ఎక్కువగా మిస్ అవుతూ ఉంటానని తెలిపాడు. అలాగే అఖిల్ తన పెళ్లి గురించి కూడా రకరకాల రూమర్లు వస్తూ ఉండడంతో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని.. తాను సింగల్ గా మాత్రమే ఉన్నాను.. మింగిల్ అయ్యే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు.

అయితే తను లవ్లో ఉన్నానని చెబుతూనే పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చాడు. తనకు లవ్ అంటే స్పోర్ట్స్ అంతే అని క్లారిటీ ఇచ్చి పడేసాడు. ఇక ఏజెంట్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ‌, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదలవుతోంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంక‌ర‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా సక్సెస్ అయితే అఖిల్ కెరీర్ కు ఇప్పట్లో తిరుగు ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news