Moviesఅస‌లు ' ద‌స‌రా ' సినిమా వెన‌క ఇంత జ‌రిగిందా... నాని...

అస‌లు ‘ ద‌స‌రా ‘ సినిమా వెన‌క ఇంత జ‌రిగిందా… నాని అంతా దాచేస్తున్నాడా…!

నాని నటించిన సినిమాలు ఒకప్పుడు మంచి లాభాలు తెచ్చి పెట్టేవి. 2015 – 2016 ఆ టైంలో నాని వరుసగా ఆరు ఏడు హిట్ సినిమాలతో దూసుకుపోయాడు. అప్పట్లో నానికి రెమ్యూనరేషన్ త‌క్కువ‌. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాలు అయిపోయేవి. కనీసం రు. 20 కోట్లు వ‌సూళ్లు చేసినా కూడా నాని సినిమాకు మంచి లాభాలు వచ్చేవి. నాన్ థియేట్రిక‌ల్‌ రైట్స్ ద్వారా నిర్మాతకు మంచి ఆదాయం వచ్చేది. కట్ చేస్తే ఇప్పుడు ఏడు, ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా నాని మార్కెట్ అదే స్థాయిలో ఉంది. నాని సినిమాకు ఏడు, ఎనిమిది ఏళ్ల క్రితం ఏ స్థాయిలో వసూళ్లు వచ్చాయో ? ఇప్పుడు అంతే వస్తున్నాయి. అయితే బడ్జెట్ డబుల్ అయిపోయింది.

ఇప్పుడుడ నాని రెమ్యునరేషన్ కూడా చుక్కల్లో ఉంది. దీంతో ఇక నాని సినిమాకు ఎంత హిట్ టాక్ వచ్చినా కూడా లాభం అన్న మాట రావటం లేదు. పేరుకు మాత్రం హిట్ అంటున్నారు తప్ప.. నిర్మాత రూపాయి లాభం కళ్ల చూసింది లేదు. జెర్సీ సినిమా సూపర్ హిట్ అన్నారు.. కానీ కొన్ని ఏరియాలకు నష్టం రావడంతో నిర్మాత గుట్టు చప్పుడు కాకుండా డిస్టిబ్యూటర్లకు ఎంతో కొంత వెన‌క్కు ఇచ్చి సెటిల్ చేశారన్న వార్తలు వినిపించాయి. శ్యాం సింగ‌రాయ, అంటే సుందరానికి సినిమాల‌కు కూడా మంచి టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా చూస్తే ఈ రెండు సినిమాలు ప్లాప్ అయినట్టే లెక్క.

ఇక ఓటీడీలోకి వెళ్లిన వి, గ్యాంగ్ లీడర్ సినిమాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. నిజంగా ఇవి థియేటర్లలో రిలీజ్ అయి ఉన్నా కాస్ట్ ఫెయిల్యూర్‌ గానే మిగిలిపోయాయి. ఇక నాని తొలిసారిగా పాన్ ఇండియా సినిమా అంటూ దసరాతో ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు రు. 70 కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు. ఇదే ప్రశ్న ప్రెస్‌మీట్లో నానికి కూడా ఎదురయింది. అయితే నాని మీరు చెప్పారా అంటూ నిర్మాత సుధాకర్‌ను స్టేజ్ మీదే అడిగేశారు.

ఆ నిర్మాత ముఖం చూస్తేనే అర్థమవుతుంది.. ఆయన నవ్వలేక. కక్కలేక మింగలేక అన్న చందంగా ఉన్నారు. అసలు వాస్తవంగా ఈ సినిమా బడ్జెట్ ఎంత ? అయింది అన్నది తెరవెనక చూస్తే చాలా స్టోరీ కనిపిస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌ కొత్త దర్శకుడు కావడంతో అసలు ఈ సినిమా ఎలా ? తీస్తారా అని కొంత టెస్ట్ షూట్ చేశారు. అందుకు కొంత ఖర్చు అయ్యింది. ఇది కూడా బ‌డ్జెట్‌లోనే క‌ల‌పాలి క‌దా ..!

సినిమా ప్రారంభమయ్యాక రెండు, మూడు షెడ్యూల్స్‌ అయాక బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని నిర్మాతకు అర్థం అయింది. మధ్యలో వదిలేస్తే అప్పటికే పెట్టింది అంతా వేస్ట్ అవుతుందని సుధాకర్ అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మరి సినిమాను పూర్తి చేశారు. అసలు బడ్జెట్ రూ. 67 కోట్లు అయిందని అంటున్నారు. దీనికి వడ్డీలు కలపాలి. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు.. లోకల్ పబ్లిసిటీ ఖర్చులు ఇవన్నీ కలిపి దసరాకు రూ 80 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బయట జరుగుతున్న ప్రచారం కంటే రు. 10 కోట్లు ఎక్కువ బడ్జెట్ అయిందని అనుకోవాలి. పైగా నాలుగు కోట్ల డెఫిసెట్ తో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

సినిమాకు అయితే మంచి బజ్‌ వచ్చింది. హిందీ వెర్షన్ ఏమైనా గట్టెక్కితే నిర్మాత బయటపడిపోతారు. తెలుగు వెర్షన్‌కు ఓవర్ ఫ్లోస్ అయితే కష్టం. ఎందుకంటే ముందుగానే అవుట్రైట్ కు అమ్మేశారు. ఇక హిందీ వెర్షన్ వసూళ్లు ఎలా ?ఉంటాయో ఆ దేవుడి మీద భారం వేసి చూడటం తప్ప ఎవరు ఏమీ చేయలేరు. నాని ఇకనైనా తన రెమ్యూనరేషన్ కాస్త కంట్రోల్లో ఉంచుకొని సినిమాల బడ్జెట్ తగ్గించుకుంటేనే నిర్మాతలు సేఫ్ అవుతారు. లేకపోతే నాని ఎప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే తన మార్కెట్ అయినా పెంచుకోవలసిన అవసరం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news