MoviesPooja Hedge - Sreeleela పూజా హెగ్డేకు ఇప్ప‌ట్లో కోలుకోలేని షాక్...

Pooja Hedge – Sreeleela పూజా హెగ్డేకు ఇప్ప‌ట్లో కోలుకోలేని షాక్ ఇచ్చిన శ్రీలీల‌… టాలీవుడ్ హాట్ టాపిక్ ఇదే..!

టాలీవుడ్ లో ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్ల లిస్టు చూస్తే పూజా హెగ్డే, శ్రీలీల‌, స‌మంత‌, ర‌ష్మిక వీళ్ల పేర్లే ప్ర‌ధానంగా వినిపిస్తూ ఉంటాయి. త్రివిక్ర‌మ్ అయితే ఇప్ప‌ట్లో పూజాను వ‌దిలే ప‌రిస్థితి లేదు. ఇక ర‌ష్మిక‌ను అంద‌రూ డైరెక్ట‌ర్లు చాయిస్‌గా పెట్టుకున్నారు. ఇక శ్రీలీల పెళ్లిసంద‌డి, ధ‌మాకా సినిమాల‌తో సూప‌ర్ హిట్లు కొట్టి ఇప్పుడు వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల‌పై క‌న్ను వేసింది. మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలో ఆమెను తీసుకున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌. శ్రీలీల‌ది రెండో హీరోయిన్ పాత్ర‌.

అయితే ఇప్పుడు అదే శ్రీలీల పూజా హెగ్డేకు కోలుకోలేని షాక్ ఇచ్చి ప‌డేసింది. మ‌హేష్‌బాబు లాంటి పెద్ద హీరోలో ఛాన్స్ రావ‌డంతో త‌బ్బిఉబ్బ‌వుతోన్న ఆమె ఇప్పుడు ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేయ‌డం గొప్ప విష‌యం కాదు. కానీ ఈ సినిమాకు ముందుగా ప‌వ‌న్ ప‌క్క‌న పూజా హెగ్గేను అనుకున్నారు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఉస్తాద్ భ‌గత్‌సింగ్ సినిమాకు పూజా పేరు ఫైన‌ల్ చేసేశారు.

హ‌రీష్ శంక‌ర్ సినిమాలలో పూజా హీరోయిన్‌గా చేసింది. పైగా ప‌వ‌న్ ప‌క్క‌న ఛాన్స్ అన‌గానే పూజా వెంట‌నే ఓకే చెప్పేసింది. ఇప్పుడు స‌డెన్‌గా ఆమె కంటే శ్రీలీల‌ను పెట్టుకుంట‌నే మార్కెట్ ప‌రంగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని మేక‌ర్స్ డిసైడ్ అయ్యార‌ట‌. అందుకే ఆమెను త‌ప్పించేసి శ్రీలీల‌ను ఫిక్స్ చేసేశారంటున్నారు. పూజా క‌న్నా కూడా శ్రీలీల‌కే ఇప్పుడు క్రేజ్ ఉంద‌నేందుకు ఇదే పెద్ద నిద‌ర్శ‌నం. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు క‌లిసి కూర్చొని డిస్క‌ర్ష‌న్లు పెట్టి మ‌రీ పూజాను త‌ప్పించేసి ఆ ప్లేస్‌లో శ్రీలీల‌ను క‌న్‌ఫార్మ్ చేశారంటున్నారు. ప‌వ‌న్‌తో సినిమా ప‌డితే శ్రీలీల క్రేజ్ ఆకాశంలోనే ఉంటుంది. వాస్త‌వానికి ఉప్పెన సినిమా త‌ర్వాత కూడా కృతిశెట్టికి ఈ రేంజ్ క్రేజ్ వ‌చ్చింది. అయితే ఆమె అది నిల‌బెట్టుకోలేదు. ఇప్పుడు శ్రీలీల మాత్రం చ‌క్క‌ని సెల‌క్ష‌న్స్‌తో దూసుకుపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news