MoviesVijaya Devarakonda ఈ పెద్దింటి హీరోలు ఇంత కంత్రిగాళ్ల ..? విజయ్...

Vijaya Devarakonda ఈ పెద్దింటి హీరోలు ఇంత కంత్రిగాళ్ల ..? విజయ్ దేవరకొండ ని తొక్కేయడానికి ఇలాంటి పనులా..?

టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇండస్ట్రీలోకి నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ వచ్చి రాజ్యమేలేస్తున్నా.. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక అవకాశం కోసం నాన్న తంటాలు పడి స్టార్ హీరో గా మారిన ఘనత విజయ్ దేవరకొండకే దక్కింది . కెరియర్ స్టార్టింగ్ లో విజయ్ దేవరకొండ పొజిషన్ ఎలా ఉండిందో మనందరికీ తెలిసిందే. ఒక్క సినిమా చేతికి రావడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. అయితే పెళ్లిచూపులు సినిమా క్లాసిక్ హిట్ అవ్వడంతో విజయ దేవరకొండ కెరియర్ మారిపోయింది . ఆ తర్వాత డైరెక్టర్ కళ్ళల్లో విజయ్ దేవరకొండ పడ్డాడు.

అంతే కాదు అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీ షేక్ చేసాడు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ ను కూడా దడదడ లాడించాడు విజయ్ దేవరకొండ . పక్కాగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అలాంటి హిట్ విజయ్ దేవరకొండకు పడింది లేదు. గీతా గోవిందం హిట్ అయినా అదంతా కూల్ ..క్లాసిక్ హీరోగా వెళ్ళిపోయింది. ఆటిట్యూడ్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కెరియర్ లో మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అర్జున్ రెడ్డి అని చెప్పాలి . ఆ సినిమాతోనే మన తెలుగు లో స్టార్ హీరోలుగా ఉన్న అందరిని తొక్కేశాడు విజయ్ దేవరకొండ .

ఆ కోపంతోనే విజయ్ దేవరకొండను సపోర్ట్ చేయకుండా వస్తున్నారు టాలీవుడ్ స్టార్స్ అన్న వాదన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. విజయ్ దేవరకొండతో సినిమాలు చేయాలన్న స్టార్ డైరెక్టర్స్ ముందుకు వస్తున్నా వెనక నుండి పలువురు బడా స్టార్స్ డైరెక్టర్స్ ని తొక్కేస్తున్నారట . విజయ్ దేవరకొండకు ఆఫర్స్ ఇవ్వద్దు అంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారట. దానికి మెయిన్ రీజన్ విజయ్ దేవరకొండకు జనాల్లో ఉన్న క్రేజ్ అంటూ తెలుస్తుంది . రీసెంట్ గా గీతాగోవిందం 2 సినిమా అనౌన్స్ చేసి కూడా ఆపేశారు పలువురు పెద్దమనుషులు .

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ను కావాలని తొక్కేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. విజయ్ దేవరకొండ కచ్చితంగా హిట్ కొడతాడు ..టాలీవుడ్ స్టార్ట్స్ ని మించి పోయే రేంజ్ లో ఉంటాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ ప్రజెంట్ శివ నిర్వాణ డైరెక్షన్లో సమంత హీరోయిన్గా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత గౌతం తిన్నూరు డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఇక తర్వాత పరుశురాం డైరెక్షన్లో ఒక సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news