Moviesఅయ్యయ్యో..ఆఖరికి అలాంటి రోల్ ని యాక్సెప్ట్ చేసిన కృతి శెట్టి.. బేబమ్మ...

అయ్యయ్యో..ఆఖరికి అలాంటి రోల్ ని యాక్సెప్ట్ చేసిన కృతి శెట్టి.. బేబమ్మ ఇంత దారుణమైన పోజిషన్ లో ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎత్తులకు పైఎత్తులకు యంగ్ బ్యూటీస్ బొక్క బోర్ల పడుతున్నారు . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు యంగ్ బ్యూటీ కృతిశెట్టి దారుణంగా మోసపోయింది అంటూ బయటపడింది . ఉప్పెన సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకున్నాయి .

ఈ క్రమంలోనే కుర్రాళ్లు కృతిశెట్టి పేరు ని ట్రెండ్ చేశారు. అమ్మడు ఓ అదృష్ట దేవతని.. దేవకన్యాన్ని ..అమ్మడు చేయి పట్టుకుంటే సినిమా బంపర్ హిట్ అని.. నోటికి వచ్చిన కొటేషన్స్ పెట్టేశారు. సీన్ కట్ చేస్తే కృతి పేరు పట్టించుకునే నాధుడే లేడు ఇప్పుడు. ఒకప్పుడు కృతి శెట్టి అని పేరు కనిపిస్తే చాలు ఎగేసుకొని కామెంట్లు చేసే జనాలు .. ఇప్పుడు కృతశెట్టి పేరు చెప్తే చూసి చూడనట్లు పక్కకు తిప్పుకునేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కృతి శెట్టి కూడా వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది .

ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసిన కృతిశెట్టి ఇప్పుడు చిన్న సినిమాలో చిన్న రోల్లో కనిపించడానికి కూడా సిద్ధపడింది అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం కృతిశెట్టి తెలుగులో కుర్ర హీరో సినిమాలో నటించడానికి ఒప్పుకునిందట . అది హీరోయిన్ కూడా కాదు కేవలం పదంటే పది నిమిషాలు పాత్ర కోసమే కృతి శెట్టి ని.. అప్రోచ్ అయ్యారట . గెస్ట్ రోల్ అని కూడా చెప్పలేం . అయినా కానీ కృతి ఈ పాత్రకి ఎందుకు ఒప్పుకుందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు . మరికొందరు బేబమ్మ పొజిషన్ బాలేదని ఆ కారణంగానే కృతి శెట్టి తన పేరుని మళ్లీ జనాల్లో పాపులారిటీ సంపాదించుకోవడానికి ఈ విధంగా సినిమాలను యాక్సెప్ట్ చేస్తుందని అంటున్నారు . ఒక్కటైతే నిజం.. అమ్మడు టైం బాగోలేదని క్లీయర్ గా అర్ధమవుతుంది. చూద్దం రానున్న రోజుల్లో కృతి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news