MoviesSuman సుమ‌న్‌ను కేసులో ఇరికించిందెవ‌రు.. మ‌నోడి కెరీర్‌ను నాశ‌నం చేసిన ఆ...

Suman సుమ‌న్‌ను కేసులో ఇరికించిందెవ‌రు.. మ‌నోడి కెరీర్‌ను నాశ‌నం చేసిన ఆ అమ్మాయి ఎవ‌రు ?

సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ అంటే రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. సుమ‌న్ అందాల రాకుమారుడు. దీనికి తోడు క‌రాటేలో బ్లాక్‌బెల్ట్‌. ఫైట్లు, యాక్ష‌న్ సీన్లు చంపేసేవాడు. అప్ప‌ట్లో ఇవ‌న్నీ సుమ‌న్‌ను స్టార్ హీరో రేంజ్‌కు తీసుకుపోయాయి. మ‌న తెలుగు స్టార్ హీరోలు తెలుగుకు మాత్ర‌మే ప‌రిమితం అయితే సుమ‌న్‌కు అటు త‌మిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ క్రేజ్ ఉండేది. అలాంటి సుమ‌న్ ఓ కేసులో జైలుకు వెళ్లి రావ‌డంతో కెరీర్ త‌ల్ల‌కిందులు అయిపోయింది.

ఆ త‌ర్వాత సినిమాలు చేసి హిట్లు కొట్టినా స్టార్ హీరో రేంజ్‌కు మాత్రం వెళ్ల‌లేకపోయాడు. సుమ‌న్ తెలుగులో స్టార్ హీరోల‌కు పోటీ వ‌స్తాడ‌నే ఓ హీరో తొక్కేశాడ‌న్న ప్ర‌చారం, రూమ‌ర్లు గ‌ట్టిగా వినిపించాయి. అయితే ఇవ‌న్నీ వాస్త‌వాలు కాద‌ని ఇటీవ‌ల మృతిచెందిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

సుమ‌న్ చాలా అంద‌గాడు కావ‌డంతో ప్ర‌తి రోజు సాయంత్రం మ‌ద్రాస్‌లో త‌న ఫ్రెండ్ నిర్వ‌హించే సినిమా క్యాసెట్లు అద్దెకు ఇచ్చే షాప్ ద‌గ్గ‌ర‌కు వెళుతూ ఉండేవాడ‌ట‌. అక్క‌డే వాళ్లు అంతా బాతాఖానీ పెట్టుకునేవారు. అక్క‌డ‌కు అప్ప‌ట్లో త‌మిళ‌నాడులో డిఐజీగా ప‌నిచేస్తోన్న ఓ పోలీస్ అధికారి కూతురు రావ‌డం.. సుమ‌న్‌ను ప్రేమించ‌డం.. ఆ త‌ర్వాత సుమ‌న్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ర‌కు వెళ్లిపోయింద‌ట‌. అయితే అప్ప‌టికే ఆమెకు పెళ్ల‌య్యిపోయింది.

భ‌ర్త ఉండ‌గా కూడా సుమ‌న్‌ను మాత్రం వ‌దిలేది కాద‌ట‌. ఆ పోలీస్ అధికారి ఎంజీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి విష‌యం చెప్పార‌ట‌. ఆయ‌న సుమ‌న్‌ను పిలిపించి ఆమె ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని చెపితే.. సుమ‌న్ ఆమెనే నా ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని చెప్పండ‌ని ఆన్స‌ర్ ఇచ్చాడ‌ట‌. సుమ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పులేక‌పోయినా ఆ ఆన్స‌ర్ చెప్పిన తీరు ఎంజీఆర్‌కు న‌చ్చ‌లేద‌ట‌. అలా ప్లాన్ చేసి బెయిల్ కూడా రాని కేసుల్లో సుమ‌న్‌ను ఇరికించి మ‌రీ జైలుకు పంపార‌ట‌.

అలా సుమ‌న్ కొద్ది రోజుల పాటు జైలులో ఉండాల్సి వ‌చ్చింది. అయితే సుమ‌న్ త‌ల్లికి అప్పుడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న అలెగ్జాండ‌ర్ క్లాస్‌మేట్‌. ఆమె వెళ్లి సుమ‌న్ ఆమె వెంట ప‌డ‌లేద‌ని.. ఆ పోలీస్ అధికారి కూతురే త‌న కొడుకు వెంట‌ప‌డింద‌ని.. కావాల‌ని సుమ‌న్‌ను ఈ కేసుస‌లో ఇరికించార‌ని చెప్ప‌డంతో సుమ‌న్ కాస్త ముందుగా బ‌య‌ట ప‌డ్డాడ‌ట‌. ఏదేమైనా ఈ కేసు సుమ‌న్ జీవితంలో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలింది. కెరీర్ కూడా ఆ త‌ర్వాత అనుకున్నంత‌గా ముందుకు సాగ‌లేదు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news