MoviesStar Hero ఘాటు శృంగారంలో మునిగి తేలుతోన్న టాలీవుడ్ ముదురు హీరో,...

Star Hero ఘాటు శృంగారంలో మునిగి తేలుతోన్న టాలీవుడ్ ముదురు హీరో, ముదురు హీరోయిన్‌…!


టాలీవుడ్‌లో అత‌డో ముదురు హీరో, ఆమె ఓ ముదురు హీరోయిన్‌. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమా, గిమా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ‌ని.. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు.. పెళ్లి కూడా చేసుకుంటార‌ని గ‌త ఐదారేళ్లుగా ప్ర‌చారం న‌డుస్తూనే ఉంది. అస‌లు సోష‌ల్ మీడియా వాళ్లు అయితే కొన్ని వంద‌ల సార్లు వీళ్ల‌కు పెళ్లి చేసి ప‌డేశారు. ఈ వార్త‌ల‌ను వాళ్లు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం అయితే ఫెవికాల్ బంధంలా ఉంది. పైగా ఆమె ముదురు ముద్దుగుమ్మ అయిపోయినా ఆమెకు తాను తెర‌వెన‌క ఉండి న‌డిపిస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావ‌డంలో ఆ ముదురు హీరోదే కీల‌క‌పాత్ర

వారిద్ద‌రు క‌లిసి చేసిన నాలుగైదు సినిమాలు కూడా సూప‌ర్ హిట్టే. అస‌లు వారి కాంబినేష‌న్‌ను తెర‌మీద చూసేందుకు జ‌నాలు పిచ్చ‌గా ఎగ‌బ‌డ‌తారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీనే స‌రికొత్త‌గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన సినిమాల్లోనూ వారు జంట‌గా క‌నిపించారు. అస‌లు గ‌త ప‌దేళ్ల నుంచి వారిద్ద‌రి స్నేహ బంధం ఎల్ల‌లు దాటేసి పీక్స్ స్టేజ్‌కు వెళ్లిపోయింద‌న్న గుస‌గుస‌లు కూడా ఉన్నాయి.

అస‌లు ఇద్ద‌రు ముదురు బెండ‌కాయ‌ల్లా ముదిరిపోతున్నా కూడా వీరు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఆ బంధ‌మే అన్న‌ది చాలా మందికి తెలిసిన విష‌య‌మే. అయితే వీరిద్ద‌రు చాలా రోజుల నుంచి ఘాటు శృంగారంలో మునిగి తేలుతున్నార‌ట‌. ఆ హీరోయిన్‌కు షూటింగ్‌లు ఉన్నా.. లేక‌పోయినా కూడా హైద‌రాబాద్‌లోనే ఉంటోంద‌ట‌. స‌ద‌రు హీరోకు ఏ మాత్రం గ్యాప్ వ‌చ్చినా వారిద్ద‌రు ఒక్క ఫ్లాట్‌లోనే ఉంటార‌న్న టాక్ ఉంది. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే.

ఆమె ఈ ఒక్క రోజు నాతో ఉండాల్సిందే అని ప‌ట్టుబ‌డితే స‌ద‌రు హీరో గారు అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆ ప‌నులు, షూటింగ్‌లు మానుకుని అయినా వెళ్లి మ‌రీ ఆమెను సంతృప్తి ప‌రుస్తార‌ట‌. అంత బ‌ల‌మైన బంధంతో వీరిద్ద‌రు ఉన్న‌ట్టు భోగ‌ట్టా..! ఇక స‌ద‌రు హీరోయిన్ కు ఫుల్లుగా అంకిత‌మైపోయిన ఆ ముదురు హీరో అస్స‌లు పెళ్ల‌న్న మాటే అన‌ట్లేద‌న్న‌ది నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఆమె కూడా త‌న తోటి హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నా.. అస్స‌లు పెళ్ల‌న్న‌మాటే మాట్లాడ‌డం లేదు.

ఆ హీరో ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా సంసారం చేసే తీరిక కూడా మ‌నోడికి లేద‌న్న‌ట్టుగా ఉంది. మ‌రో రెండు మూడేళ్లు వీళ్లు ఇలాగే కానిచ్చేసి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని కొంద‌రు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news