MoviesPushpa 2 లో ఆ స్టార్ హీరో..బన్నీ హర్ట్.. సుక్కు...

Pushpa 2 లో ఆ స్టార్ హీరో..బన్నీ హర్ట్.. సుక్కు తప్పుచేస్తున్నాడా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా Pushpa పుష్ప 1. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాతే రష్మిక పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలు తన ఖాతాలో ఉండడానికి కారణం ఇదే.

ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించాడు బన్నీ – సుకుమార్ . కాగా సుకుమార్ ఈ సినిమాలో మరో మెగా హీరోని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . అతడు ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రాంచరణ్ . సెకండ్ పార్ట్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్లో చరణ్ ను ఇన్వాల్వ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట . ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను కంప్లీట్ చేశాడట .

చరణ్ కొంచెం ఫ్రీ అవ్వగానే షూట్ కూడా కంప్లీట్ చేయబోతున్నారట. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి యాక్సిడెంట్ అయ్యే టైంలో బన్నీ ప్రాణాలు కాపాడడానికి చరణ్ వచ్చే విధంగా కథను రాసుకున్నాడట. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మెగా అభిమానులకు పూనకాలు కన్ఫామ్ . కచ్చితంగా ఈ సినిమా మరో లెవెల్ లో బీభత్సమైన రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం హర్ట్ అవుతున్నారు..చరణ్ ని సినిమాలో పెడితే క్రేజ్ మొత్తం ఆయన పై మళ్లిపోతుందని..బన్నీ బిస్కెట్ అవుతాడని..చరణ్ బదులు వేరే హీరో పెడితే ఇద్దరు సేఫ్ జోన్ లో ఉంటాఏని సజీషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news