MoviesJR NTR ఎన్టీఆర్ అంటే ఎంత పిచ్చ ఇష్ట‌మో మ‌రోసారి బ‌య‌ట...

JR NTR ఎన్టీఆర్ అంటే ఎంత పిచ్చ ఇష్ట‌మో మ‌రోసారి బ‌య‌ట పెట్టిన జాన్వీక‌పూర్‌..!

జాన్వీక‌పూర్ సౌత్ సినిమా ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ్. ముందు ఎన్టీఆర్‌కు జోడీ అన్నారు. ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబు సినిమాలో అన్నారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఆమె హీరోయిన్‌గా సెట్ అయిపోయింద‌న్నారు. ఇవేవి జ‌ర‌గ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పాన్ ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు జాన్వీ సంత‌కం కూడా చేసేసింది. రెమ్యున‌రేష‌న్ రు. 4 కోట్ల రేషియోకు కాస్త అటూ ఇటూగా ఉంటుందంటున్నారు.

అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే రావాల్సి ఉంది. ఇది జాన్వీకి తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం తాను చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని జాన్వీ ముందు నుంచే లీకులు ఇస్తోంది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఎన్టీఆర్‌ను పొగుడుతూనే ఉంటోంది. ఇక ఈ సినిమా కోసం కొర‌టాల లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. పైగా వ‌చ్చే యేడాది ఏప్రిల్ రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు.

ఆచార్య ప్లాప్ భ‌యంతో కొర‌టాల ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే జాన్వీకి ఇప్పుడు కొన్ని బాలీవుడ్ ఛాన్సులు కూడా వ‌స్తున్నాయి. అయితే జాన్వీ మాత్రం ముందు ఎన్టీఆర్ సినిమాకే త‌న ఫ‌స్ట్ ప్ర‌యార్టీ అని చెప్ప‌క‌నే చెప్పేసింద‌ట‌. రెండేళ్ల క్రితం సౌత్ సినిమా అంటే ఎందుకోగాని చిన్న‌చూపుగా ఉండేది ఆమెకు. అయితే బాలీవుడ్ సినిమా గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతుంటే.. ఇటు సౌత్ సినిమా దూసుకుపోతోంది.

ముఖ్యంగా తెలుగు సినిమా అంటే ఇప్పుడు నేష‌న‌ల్ లెవ‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. అందుకే ఆమె ఇప్పుడు తెలుగు సినిమాతోనే సౌత్ ఎంట్రీ.. అందులోనూ ఎన్టీఆర్‌తో ఫ‌స్ట్ సినిమా చేస్తే ఇక త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సినిమాకే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ ఇస్తూ.. కొన్ని బాలీవుడ్ ఛాన్సుల‌ను కూడా వ‌దిలేసుకుంద‌ని తెలుస్తోంది.

గ‌తంలో జాన్వీ త‌ల్లి శ్రీదేవి – ఎన్టీఆర్ తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ అంటే పిచ్చ క్రేజ్.. మ‌రి ఇప్పుడు వారి వార‌సులు కాంబినేష‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి. ఇక ఈ సినిమాలో కొంత మైథలాజిక‌ల్ ట‌చ్ కూడా ఉండేలా కొర‌టాల ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో కొర‌టాల – ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ పెద్ద హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై స్కై రేంజ్ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news