MoviesAllu Aravind అల్లు అరవింద్ తిక్క కుదిరిందా..? ఇక ఆ హీరో...

Allu Aravind అల్లు అరవింద్ తిక్క కుదిరిందా..? ఇక ఆ హీరో అడుక్కుతినాల్సిందేనా..?

అయ్యయ్యో .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్టు పాపం ఓటమి ఎరగని ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అల్లు అరవింద్ కు సడన్ షాక్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ పరుశురాం . మనకు తెలిసిందే గీతగోవిందం సినిమాను డైరెక్ట్ చేసిన పరుశురాం పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో.. ఆ తర్వాత సర్కారీ వారి పాట సినిమా తెరకెక్కించినప్పటికీ ఇంకా గీతాగోవిందం డైరెక్టర్ అంటూ ఆయనను గుర్తిస్తున్నారు.

దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు .. ఈ సినిమా జనాలకు ఎంత బాగా నచ్చేసిందో .. ఇంత బాగా నచ్చేసిన సినిమాకి సీక్వెల్ తీయకపోతే ఏం బాగుంటుంది .. అందుకే గీత గోవిందం 2 సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్ . యధావిధిగా గీత బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మించాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యాడు. డైరెక్టర్ కూడా అందుకు ఓకే చెప్పాడు .. అంతేనా భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నారు .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ప్లాన్ మార్చేశారు .. మ్యాటర్లోకి దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యాడు . దీంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ ఆశలు నిరాశగా మిగిలాయి. రాత్రికి రాత్రి మరో భారీ టెంప్టింగ్ ఆఫర్ తో పరశురాంను లైన్ లో పెట్టేసి అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేశాడు. దీనికి విజయ్ దేవరకొండ కూడా సహకరించారు. అల్లు అరవింద్ కు తిక్క రేగిపోయింది . నా దగ్గర డబ్బులు తీసుకుని అతగాడి దగ్గర కమిట్మెంట్ ఇస్తావా అంటూ ఫైర్ అయిపోయాడు . ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి అడిగి పారేయాలి అనుకున్నాడు. తీరా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు కొందరు ఆయనకి ఫోన్ చేయడంతో మ్యాటర్ కూల్ అయింది.

అయితే పరశురాం చాలా సైలెంట్ పర్సన్.. ఇలా చీట్ చేసేవాడు కాదు ..ఎందుకు పరశురాం హ్యాండ్ ఇచ్చాడా అంటే అల్లు అరవింద్ కారణం అంటూ తెలుస్తుంది . అల్లు అరవింద్ కమిట్ మెంట్ గల వ్యక్తి చెప్పిన చెప్పిన టైంకి చేయాలి.. పద్ధతికి మరో మారుపేరు అంటుంటారు ఇండస్ట్రీలో ఉండే జనాలు. మరి అలాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలంటే కూసింత కష్టమే ..అందుకే ఫ్రీడమ్ కి మరో మారుపేరైన దిల్ రాజుతో కమిట్ అయ్యి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని పెట్టి గీతగోవిందం 2 తెరకెక్కించబోతున్నారు. కాగా గతంలో అల్లు అరవింద్ కోపానికి గురైన ఓ స్టార్ హీరో ఇలాగే ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ప్రజెంట్ ఆ హీరో ఎక్కడున్నాడో కూడా తెలియదు . ఒకవేళ అల్లు అరవింద్ తలచుకుంటే ఏమైనా చేయగలడు.. ఆయన కోపానికి గురైతే అడుక్కుతినాల్సిందే అంటూ అల్లు ఫాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news