Moviesనేడు తారకరత్న పుట్టినరోజు.. నందమూరి బాలయ్య ఏం చేసాడో తెలుసా..కన్నీళ్ళు పెట్టుకుంటున్న...

నేడు తారకరత్న పుట్టినరోజు.. నందమూరి బాలయ్య ఏం చేసాడో తెలుసా..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!

కొన్ని కొన్ని మూమెంట్స్.. మనం మర్చిపోవాలన్నా మర్చిపోలేం . మన కళ్ళ ముందు మెదులాడుతూ .. మనల్ని గుర్తు చేస్తూ మరింత బాధపడుతూనే ఉంటాయి . కాగా రీసెంట్గా అదే ఇన్సిడెంట్ ని.. అవే మూమెంట్స్ లో గుర్తు చేసుకుని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు నందమూరి కుటుంబ సభ్యులు .. నందమూరి ఫ్యాన్స్ . మనకు తెలిసిందే నందమూరి తారకరత్న నాలుగు రోజుల క్రితం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ మరణించారు.

నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు . ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ చేశారు . అయితే గత 23 రోజులుగా సుదీర్ఘంగా మరణంతో పోరాడిన ఆయన చివరికి అలసిపోయి ప్రాణాలను విడిచారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా ఆయన అంతమ సంస్కారాలను సాంప్రదాయ బద్దంగా తండ్రి మోహన్ కృష్ణ జరిపించారు .

కాగా నేడు నందమూరి తారకరత్న 40వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఆయనను తలుచుకొని ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో తారకరత్న – బాలయ్య.. తారకరత్న బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో హుషారుగా.. చలాకిగా.. నవ్వుతూ ..అల్లరి అల్లరిగా కనిపించిన తారకరత్న మన మధ్య లేడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అవుతున్నారు .

తారకరత్న పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన లేకపోయినా సరే బాలకృష్ణ అనాధ పిల్లలకు అన్నదానం నిర్వహిస్తున్నారట . అంతేకాదు తన పిల్లల దగ్గర తారకరత్న బర్త్ డే కేక్ ని కట్ చేయించి ఆయన ఫోటో వద్ద నివాళులు అర్పించారట. తన కొడుకు లాంటి కొడుకు లేకపోయినా సరే తన కొడుకు పిల్లల బాధ్యతలను ఆయన స్వయంగా ఆయన దగ్గరుండి చూసుకుంటానని తారకరత్న భార్య అలెఖ్య రెడ్డికి మాటిచ్చారట. దేవుడు ఇంత మంచి కుటుంబానికి అన్యాయం చేశాడు అంటూ మండిపడుతున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news