MoviesShobhan babu శోభ‌న్‌బాబు ఇచ్చిన ట్విస్ట్‌తో ఎన్టీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందా…!

Shobhan babu శోభ‌న్‌బాబు ఇచ్చిన ట్విస్ట్‌తో ఎన్టీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందా…!

దర్శకుడు బాపు రూపొందించిన తొలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. శ్రీరాముడంటే ఎన్టీ రామారావే అని ప్రేక్షకులు ఫిక్స్‌ అయిన తరుణంలో ఇందులో శోభన్‌బాబును రాముడి పాత్రకు ఎన్నుకోవడం సంచలనం అయింది. అంతేకాదు.. ఈ సినిమా నిర్మాణానికి ముందు.. శోభ‌న్‌బాబు.. న‌టించిన రెండు సినిమాల్లోనూ ఆయ‌న రౌడీ పాత్ర‌లు పోషించారు. అవి సూప‌ర్ హిట్ అయ్యారు. దీంతో శోభ‌న్‌బాబును రౌడీగానే ఆయ‌న అభిమానులు ఆహ్వానించారు.

ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌ను రాముడిగా పెట్టి తీయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తు విమర్శలు వినిపించాయి. దానికి తోడు ఎన్టీఆర్‌ ఎప్పటినుంచో ‘శ్రీరామ పట్టాభిషేకం’ సినిమా తీయాలని సముద్రాల రాఘవచార్యతో స్క్రిప్ట్‌ తయారు చేయించి సిద్ధంగా ఉన్నారు. అందుకే సినిమా ప్రారంభించే ముందు ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి ఈ విషయం తెలిపారు బాపు, రమణ. ‘తీసుకోండి. కానీ నేను షూటింగ్‌ ప్రారంభిస్తే మీరు ఇబ్బంది పడతారు’ అన్నారు ఎన్టీఆర్‌.

విమర్శలను పట్టించుకోకుండా నిష్టతో, ఏకాగ్రతతో సినిమా పూర్తి చేశారు. శోభ‌న్‌బాబుకు రోజూ ఆహారంలో మాంసం ఉండాల్సిందే. అయితే.. బాపు గారి కండిష‌న్ వేరు. సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మాంసాహారం ముట్టకూడ‌ద‌ని ష‌ర‌తు పెట్టారు. ఇష్టం లేక‌పోయినా.. బాపు వంటి వారితో సినిమా కాబ‌ట్టి శోభ‌న్‌బాబు ఓకే చెప్పారు. ఇక‌, ఎస్వీ రంగారావు కూడా అంతే. మాంసాహారానికి మ‌ద్యానికి దూరంగా ఉన్నారు.

మొత్తానికి ఈ సినిమాలో అనేక ప్ర‌య‌త్నాలు సాగాయి. అవ‌న్నీ కూడా బాబు ర‌మ‌ణ‌ల కృషికి తార్కాణంగా నిలిచాయి. 1972 మార్చి 16న ‘ సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలైంది. కానీ కలెక్షన్లు లేవు. థియేటర్‌లో జనం అంతంత మాత్రమే. రెండు వారాల వరకూ ఇదే పరిస్థితి. ఈ టాక్‌ విని భయపడిన శోభన్‌బాబు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదట‌.

ఆ తర్వాత మూడో వారం చివ‌రికి కానీ.. సినిమా పుంజుకోలేదు. బాగుంది అనే టాక్ రావడంతో థియేటర్లు పట్టనంత జనం వచ్చారు. సినిమా చూడడమే మానేసిన వాళ్లు కూడా ఈ చిత్రాన్ని చూడడానికి రావడం విశేషం. ఇక‌, ఎన్టీఆర్ సైతం.. ఈ సినిమాను వీక్షించి.. కాస్త ఆశ్చ‌ర్యానికి గుర‌వ్వ‌డంతో పాటు త‌మ్ముడు నాకు పోటీ ఇస్తున్నాడే.. అని శోభ‌న్‌బాబుకు కితాబునిచ్చార‌ట‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news