Movies" నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు" సంకనాకిపోవడానికి కారణం అదే..కూర టేస్ట్...

” నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” సంకనాకిపోవడానికి కారణం అదే..కూర టేస్ట్ రావడానికి అలాంటివి కలుపుతారా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ కిర్రాక్ ఆర్ పి ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఆయన జబర్దస్త్ పై చాడీలు చెప్పినప్పటి నుంచి ఆయన పేరుని సోషల్ మీడియాలో కావాలనే కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆర్పీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కాగా రీసెంట్గా ఆయన ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షోలు మానేసి సొంతంగా బిజినెస్ పెట్టుకున్న ఆర్ పి రెండు నెలల క్రితం నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు అనే పేరుతో హైదరాబాద్లో కర్రీ పాయింట్ ని ప్రారంభించాడు . కాగా మొదట్లో ఈ బిజినెస్ కు మంచి పేరు లభించింది.. ఊహించిన విధంగా ఎక్కువ జనాలు రావడం టెస్ట్ బాగుంది అన్న కామెంట్లు రావడంతో కిర్రాక్ ఆర్పి బిజినెస్ రేంజ్ లో దూసుకుపోయింది .

అయితే ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో ..అక్కడే నెగెటివిటీ ఉంటుంది ..ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడే తిట్టేవాళ్ళు ఉంటారు . ఓ మనిషి కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటే ఓర్వలేని జనాలు అతని కిందకు లాగడానికి తొక్కేయడానికి ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా అలాంటి మూర్ఖుల మూర్ఖత్వానికి బలైపోయాడు కిర్రాక్ ఆర్పి . కాగా గత కొన్ని రోజుల నుంచి కిర్రాక్ ఆర్పి బిజినెస్ దెబ్బతినింది . దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ పై కొందరు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. షాప్ లో డీసెన్సీ లేదని ..ఈగలు వాళ్లుతుంటాయని..మరీ ముఖ్యంగా హ్యాండ్ వాష్ కూడా చేసుకోకుండానే సర్వ్ చేస్తున్నారని.. రకరకాలుగా కొందరు షాప్ పై కామెంట్స్ చేశారు .

ఈ క్రమంలోనే కొందరు రెచ్చిపోయి పులుసు టేస్ట్ గా రావడానికి వాళ్ళు రకరకాల పౌడర్లు వాడుతున్నారని.. అవంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ..ఇలాంటి క్రమంలోనే ఈ విషయాన్ని కనిపెట్టిన సిబ్బంది ఒక్కొక్కరుగా ఆ విషయాన్ని లిక్ చేయడంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ దెబ్బతినింది అంటూ తెలుస్తుంది . అయితే రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పి వీటిపై స్పందించాడు . :నన్ను కావాలనే కొందరు తొక్కేస్తున్నారు అంటూ మండిపడ్డారు ..ఇదంతా పెయిడ్ బ్యాచ్ పని అంటూ ఓపెన్ గా చెప్పేసారు . నా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను ..మోసం చేసి ఇన్నాళ్లు బిజినెస్ చేయలేను.. నిజాయితీగాని నా వ్యాపారం చేసుకుంటున్నాను .. మొదట్లో షాప్ ఓపెన్ చేసిన కొత్తల్లో పదిమంది వచ్చిన కూర బాగుందని చెప్పారు ..ఆ ఆనందం నేనెప్పటికీ మర్చిపోలేను ..ఎవరో ఓర్వలేని వాడు ఇలా చేస్తున్నాడు “అంటూ ఘాటుగా స్పందించారు .అంతే కాదు నన్ను ఎవరు బ్యాడ్ చేయలేరు.. ఎంత నెగటివ్ వస్తే నాకు అంత ప్రమోషన్ అంటూ లైట్ తీసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news