Moviesక‌ళ్యాణ్‌రామ్ ' అమిగోస్ ' ర‌న్ టైం.. సినిమాకు ఇలాంటి టాక్...

క‌ళ్యాణ్‌రామ్ ‘ అమిగోస్ ‘ ర‌న్ టైం.. సినిమాకు ఇలాంటి టాక్ వ‌చ్చిందేంటి…!

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ లాంటి వైవిధ్య‌మైన సినిమాతో ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క‌ళ్యాణ్‌రామ్ చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట బ్యాన‌ర్లో మంచి సినిమా చేయ‌డంతో పాటు కెరీర్‌లో ఫ‌స్ట్ టైం త్రిబుల్ రోల్లో క‌నిపిస్తున్నాడు. చిరంజీవి ముగ్గురు మొన‌గాళ్లు, తారక్ కూడా జై ల‌వ‌కుశ సినిమాలో త్రిబుల్ రోల్స్ చేశార‌ని.. ఆ సినిమాల‌కు మించి ఈ సినిమా భిన్నంగా ఉంటుంద‌ని కూడా క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌మోష‌న్ల‌లో ఘంటా ప‌థంగా చెప్పాడు.

కొత్త ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. జిబ్రాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఎప్పుడూ లేన‌ట్టుగా ఈ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బ‌జ్ వ‌చ్చేసింది. మైత్రీ వాళ్లు సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ఏపీ, తెలంగాణ వ‌ర‌కు ఎప్పుడో రు. 9 కోట్ల‌కు అమ్మేశారు.

ఇక ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చీప్ గెస్ట్‌గా రావ‌డం కూడా సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చిన‌ట్ల‌య్యింది. పైగా క‌ళ్యాణ్ కెరీర్‌లో పెద్ద హిట్ అయిన బింబిసారా తర్వాత వస్తున్న సినిమా కావ‌డం, బింబిసార‌లా పోటీ కాకుండా… సోలోగా వ‌స్తుండ‌డం కూడా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌స్తాయ‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది.

ఈ సినిమాకు ఫైన‌ల్ ర‌న్ టైం 2 గంట‌ల 19 నిమిషాలు. అంటే మొత్తం 139 నిమిషాల పాటు సినిమా ఉండ‌నుంది. అంటే క్రిస్పీ ర‌న్ టైంగానే చెప్పాలి. ఇక సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు. సినిమా మాత్రం చాలా కొత్త‌గా ఉంద‌ని వారంతా మెచ్చుకున్న‌ట్టు టాక్ ? క‌మ‌ర్షియ‌ల్‌గా స‌రికొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తుంద‌నే టాక్ ఎక్కువుగా వ‌చ్చేసింది. అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో బాల‌య్య ధ‌ర్మ‌క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులు వ‌స్తాయి సాంగ్‌ను రీమిక్స్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news