MoviesPrakash Raj "దాని ముఖానికి ఆస్కార్ కాదు కదా..భాస్కర్ కూడా రాదు"..ప్రకాష్...

Prakash Raj “దాని ముఖానికి ఆస్కార్ కాదు కదా..భాస్కర్ కూడా రాదు”..ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు Prakash Raj ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ రీసెంట్గా మా ఎలక్షన్స్ లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి తెలుగు తెరపై పెద్దగా కనిపించని ప్రకాష్ రాజ్ అవకాశాలు వస్తే మాత్రం తెలుగులో సినిమాలు చేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు . రీసెంట్గా ప్రకాష్ రాజ్ కేరళలోని తిరుమనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2023 ఈవెంట్లో పాల్గొన్నారు.

కాగా అక్కడ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈవెంట్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ చాలా సరదాగా చలాకీగా నవ్వుతూ జాలీగా గడిపారు. కాగా ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. షారుక్ ఖాన్ “పథాన్” మూవీని ఓ రేంజ్ లో పొగిడేసారు . పనిలేని దద్దమ్మలు అందరూ పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ నానా హంగామా చేశారు . ఈ ఇడియట్స్ , బిగాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏం మూసుకుంటారో వాళ్ళకే తెలియాలి .. ఆ సినిమా 700 కోట్లకు పైగా వసూలు చేసింది ..ఇంకా దూసుకుపోతుంది.. ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలని ఎలా అనుకుంటారో.. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని గోల చేసిన వారు ఈ సక్సెస్ జీర్ణించుకోలేకపోతున్నారు”.

” రీసెంట్ గా వచ్చిన నాన్ సెన్స్ చిత్రాలలో కాశ్మీరీ ఫైల్స్ ఒకటి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారో మనందరికీ తెలుసు ..చాలా సిగ్గుచేటు ఇంటర్నేషనల్ జ్యూరీ మేకర్స్ వీళ్ల పై ఉమ్మేసింది అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్తున్నా అతనికి భాస్కర్ అవార్డు కూడా రాదు. ప్రతిసారి జనాలని పూల్ చేయలేరు కదా అంటూ ఫన్నీగా స్పందించారు. అంతే కాదు ఈ సినిమా కోసం దాదాపు రెండువేల కోట్లు పెట్టుబడి పెట్టారేమో అనిపిస్తుంది అంటూ వెటకారంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. దీంతో ప్రకాష్ రాజ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. కాగా తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఈసారి సినిమాకి ఆస్కార్ వస్తుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news