Moviesహ్యాట్సాఫ్ అఖిల్.. తారకరత్న కోసం ఏ హీరో చేయని పని..పొగిడేస్తున్న ఫ్యాన్స్..!!

హ్యాట్సాఫ్ అఖిల్.. తారకరత్న కోసం ఏ హీరో చేయని పని..పొగిడేస్తున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారకరత్న మొన్న రాత్రి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పేరుట చేపట్టిన పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకి గుండె నిప్పి వచ్చింది . దీంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు . ఇదే క్రమంలో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు .

కాగా గత 23 రోజుల నుంచి మరణంతో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన మొన్న రాత్రి తుది శ్వాసను విడిచారు . ఈ విషాద వార్తతో నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ చేసిన చేసిన పని అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది .

మనకు తెలిసిందే అక్కినేని అఖిల్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం . క్రికెట్లో మంచి నైపుణ్యం ఉంది . అంతెందుకు ఒకానొక దశలో అఖిల్ జోరు చూసి స్టార్ క్రికెటర్ అవుతారని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే సినిమాలోకి వచ్చి హీరోగా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు . రీసెంట్గా సిసిఎల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే . రాయపూర్ లో నిన్న తెలుగు వారియర్స్ కేరళ స్టైకర్స్ మధ్య టఫ్ మ్యాచ్ జరిగింది .

ఈ మ్యాచ్ లో అఖిల్ బౌండరీల వర్షం కురిపించాడు . ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. దీంతో అఖిల్ ట్వీట్ అందరిని ఆకస్ట్టుకుంది. ” ఈ సందర్భంగా ఈ విజయాన్ని నేను నా మాజీ టీమ్ మేట్ తారకరత్న గారికి అంకితం ఇస్తున్నాను. ఈరోజు ఆయన మాతో ఇక్కడ ఉండి ఉంటే చాలా బాగుండేది” అంటూ ఎమోషనల్ గా ట్విట్ చేశాడు . నందమూరి ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు . దీంతో అఖిల్ అక్కినేనిని అందరూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news