MoviesTrivikram ఆ సినిమా దొబ్బేస్తుందని త్రివిక్ర‌మ్ ముందే చెప్పాడు .. ప్రొడ్యూస‌ర్...

Trivikram ఆ సినిమా దొబ్బేస్తుందని త్రివిక్ర‌మ్ ముందే చెప్పాడు .. ప్రొడ్యూస‌ర్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసిందే. ఏ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో.. ఆ సినిమా అస్సలు ఆడడం లేదు.. మినిమం డిపాజిట్లు కూడా రాకుండా .. నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది బుట్ట బొమ్మ సినిమా . కోలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ దాసుతోపాటు చైల్డ్ యాక్ట్రెస్ అనిక సురేంద్రన్.. సూర్య వశిష్ట ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బుట్ట బొమ్మ సినిమా ఫిబ్రవరి 4న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది . కొందరి అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చినా.. కనెక్ట్ అయిన.. వసూళ్ల పరంగా మాత్రం డిజాస్టర్ గా మారింది. కాగా సితార ఎంటర్టైన్మెంట్ తో కలిసి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సినిమాను నిర్మించారు . కాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా మారుతుంది అని సింగిల్ షాట్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చెప్పేశారు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఆయన చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకున్నాడు నాగవంశి. ఈ సినిమాని రిలీజ్ కి ముందే త్రివిక్రమ్ కి చూపించామని .. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన ముందే చెప్పారని ..అనుకున్నట్లే రిజల్ట్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని సూర్యదేవరనాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . దీంతో మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news