MoviesBalayya వావ్: మరోసారి లుంగి కట్టి రచ్చ చేయబోతున్న బాలయ్య..నందమూరి అభిమానులకి...

Balayya వావ్: మరోసారి లుంగి కట్టి రచ్చ చేయబోతున్న బాలయ్య..నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య తాజాగా హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి . సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీర సింహారెడ్డి సినిమా దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 147 కోట్లకు పైగా వసూలు చేసింది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . అంతేకాదు ఓవర్సీస్ లోను బాలయ్య మరోసారి తన సత్తా చాటాడు. ఓవర్సీస్ లోను వీర సింహారెడ్డి మంచి కలెక్షన్స్ రాబట్టింది .

ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో నటించి మెప్పించాడు . అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలయ్య మరదలు పాత్రలో కనిపించి నటించి మెప్పించింది. వీరసింహారెడ్డి ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 14 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది . ఇదే విషయాని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది డిస్ని హాట్ స్టార్.

ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి సినిమా స్ట్రీమింగ్ కానుంది అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ మరోసారి వీరసింహారెడ్డి సినిమాను టీవీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం. ప్రజెంట్ బాలకృష్ణ – అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కే సినిమా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు..!!

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FDisneyPlusHSTel%2Fstatus%2F1624626853343551488&widget=Tweet
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news