MoviesAmigos Second Day Collections : మిక్స్డ్ టాక్ తో ఊహించని...

Amigos Second Day Collections : మిక్స్డ్ టాక్ తో ఊహించని కలెక్షన్లు..మరోసారి మైండ్ బ్లాక్!!

టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం అమిగోస్. ఫస్ట్ టైం నందమూరి హీరో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన నెగిటివ్ రోల్ సూపర్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు.

కాగా ఇదే క్రమంలో అవిగోస్ ఫస్ట్ డే కలెక్షన్స్ నందమూరి అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది . అయితే ఆ కలెక్షన్స్ సెకండ్ డే మరింత దారుణంగా పడిపోవడంతో కళ్యాణ్రామ్ అమిగోస్ సినిమా హిట్టా ఫట్టా అంటూ తేల్చుకోలేని పొజిషన్లో ఉండిపోయారు జనాలు . మొదటి రోజు 2.85 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండోరోజు ముక్కి మూలిగి కోటి దక్కించుకుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . నిజంగా నందమూరి లాంటి హీరోకు ఇది డిజాస్టర్ అనే చెప్పాలి .

నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకొంచెం ట్రై చేస్తే మూడో రోజు ఈ సినిమా 1.50 కోట్లు షేర్ రాబట్టి అవకాశం ఉంది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . కాగా కళ్యాణ్ రామ్ తో రాజేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్ గా మారినట్టు తెలుస్తుంది. అమిగోస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజుకి వచ్చేసరికి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్న కానీ టికెట్స్ హైక్స్ వలన ఆన్లైన్ టికెట్ సేల్స్ అమాంతం హోల్డ్ కనిపించకపోవడంతో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని సినిమా ఎక్కువగా నమ్ముకుంది అయినా కానీ సినిమా కి అనుకున్నంత వసూలు రావట్లేదు. చూడాలి మరి రానున్న మూడో రోజుల్లో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news