MoviesTrisha బిగ్ బ్రేకింగ్: అస్వస్ధత కు గురైన స్టార్ హీరోయిన్ త్రిష.....

Trisha బిగ్ బ్రేకింగ్: అస్వస్ధత కు గురైన స్టార్ హీరోయిన్ త్రిష.. హాస్పిటల్ కి తరలింపు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ చెన్నై చంద్రం త్రిష అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే ” నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన త్రిష ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏ లేసిన అందాల ముద్దుగుమ్మ త్రిష .. కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి దూరమైంది . ఈ క్రమంలోనే రీసెంట్గా పోనియన్ సెల్వన్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ..సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

కాగా ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో కలిసి లియో చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతుంది . అక్కడ ప్రజెంట్ క్లైమేట్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే . భారీ మంచు కురుస్తూ కాళ్ళు బయట పెట్టలేని పొజిషన్లో జనాలు ఉన్నారు . కానీ షెడ్యూల్ ప్రకారం షూట్ కంప్లీట్ చేయాలని అక్కడికి వెళ్లిన చిత్ర బృందం కాశ్మీర్ లో ఇరుక్కుపోయింది . కాలు బయట పెట్టలేని పొజిషన్లో సినిమా యూనిట్ ఉంది . ఈ క్రమంలోని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని చెన్నైకి వచ్చేయాలని ఆలోచిస్తుంది చిత్ర బృందం .

ఈ క్రమంలోనే చలికి తట్టుకోలేక స్టార్ హీరోయిన్ త్రిష కు జ్వరం వచ్చినట్టు తెలుస్తుంది . దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయిన్నట్లు అక్కడ నుంచి సమాచారం అందుతుంది . ఈ క్రమంలోనే హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన మేకర్స్ ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారట . అంతేకాదు ఇప్పటివరకు ప్రెసెంట్ త్రిష కండిషన్ బాగానే ఉందని కానీ కదలేకపోతుందని ఈ కారణంగానే కొన్ని రోజులపాటు ఆమెను షూటింగ్ కి దూరంగా ఉంచాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ త్రిష కాశ్మీర్ నుండి చెన్నైకి వచ్చేసి తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోని త్రిష అభిమానుల ..ఆమె ఆరోగ్యంపై వివరణ కావాలని నిలదీస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news