MoviesRam Charan "ఏ బిడ్డా ఇది నా అడ్డా".. మెగా అభిమానులకు...

Ram Charan “ఏ బిడ్డా ఇది నా అడ్డా”.. మెగా అభిమానులకు అదరిపోయే అప్ డేట్ వచ్చేసిందోచ్..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. త్వరలోనే ఆస్కార్ అవార్డు అందుకోనుంది. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – రాంచరణ్ పేర్లు..ఓ రేంజ్ మారుమ్రోగిపోతుంది.

స్టార్ హీరో శంకర్ డైరెక్షన్లో ప్రతిష్టాత్మకమైన సినిమాకి కమిట్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్నారు. త్వరలోనే మూడో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను డైరెక్టర్ శంకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకుని వచ్చారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని న్యూజిలాండ్ లో సగానికి పైగా కంప్లీట్ చేశారు చిత్ర బృందం .

కాగా ఇక్కడే దాదాపు 15 కోట్ల ఖర్చు పెట్టి ఓ డ్యూయెట్ సాంగ్ ని తెరకెక్కించారు. కాగా రీసెంట్ గా హైదరాబాద్లో ఈ సినిమా షూట్ ని ప్రారభించారు. దీనికి సంబంధించిన విషయాలను..అఫిషీయల్ గా అనౌన్స్ చేసాడు శంకర్. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం చార్మినార్ వద్ద చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పుకొచ్చాడు . దీనికి సంబంధించి శంకర్ చార్మినర్ దగ్గర దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకుని వచ్చారు. ఈ క్రమంలోని రామ్ చరణ్ తన సొంత గడ్డ హైదరాబాద్ పై షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలిసి మెగా ఫాన్స్ “ఏ బిడ్డ ఇది నా అడ్డా” అంటూ ట్యాగ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news