MoviesAmigos Review: TL రివ్యూ: అమిగోస్‌… వాచ్‌బుల్ థ్రిల్ల‌ర్‌

Amigos Review: TL రివ్యూ: అమిగోస్‌… వాచ్‌బుల్ థ్రిల్ల‌ర్‌

టైటిల్‌: అమిగోస్‌
బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌
న‌టీన‌టులు: నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, అషికా రంగ‌నాథ్‌, బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్‌
ఫైట్స్ : వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
మ్యూజిక్‌: జిబ్రాన్‌
స‌హ నిర్మాత‌: హ‌రి తుమ్మ‌ల‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజేంద్ర‌రెడ్డి
పీఆర్వో: వంశీ కాకా
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్: ఫిబ్ర‌వ‌రి 10, 2023
ర‌న్ టైం : 139 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ ( వ‌ర‌ల్డ్ వైడ్‌): 11.30 కోట్లు

అమిగోస్‌ ప‌రిచ‌యం:
నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ గ‌తేడాది వ‌చ్చిన బింబిసార సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు. ఆ సినిమా రు. 40 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి.. క‌ళ్యాణ్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్ న‌టించిన సినిమా అమిగోస్‌. బింబిసార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎఫెక్ట్‌కు తోడు అమిగోస్ స్టిల్స్‌, ట్రైల‌ర్ చూశాక ఈ సినిమా హిట్ అన్న జోష్ అయితే వ‌చ్చేసింది. పైగా మైత్రీ మూవీ బ్యాక‌ప్‌. ఈ బ్యాన‌ర్ నుంచి రీసెంట్‌గా సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య రెండూ పెద్ద హిట్లు. ఇప్పుడు అమిగోస్‌తో హ్యాట్రిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడ‌తామ‌న్న ధీమాతో వారు ఉన్నారు. ఇటు క‌ళ్యాణ్ కూడా బింబాసార ఫామ్ కంటిన్యూ చేస్తానంటున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో క‌ళ్యాణ్ మూడు విభిన్న పాత్ర‌ల్లో ఫ‌స్ట్ టైం న‌టిస్తున్నాడు. అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి అమిగోస్‌తో క‌ళ్యాణ్ వ‌రుస‌గా రెండో హిట్ కొట్టాడా ? లేదా ? అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

అమిగోస్‌ క‌థ‌:
ఒకేలా ఉండే వ్య‌క్తుల‌ను క‌ల‌వ‌డం వ‌ల్ల కొంద‌రి జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు జ‌రిగాయ‌న్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌ళ్యాణ్‌రామ్ ( సిద్ధార్థ్‌) త‌న లాంటి వ్య‌క్తి కోస‌మే ఓ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి మంజు (కళ్యాణ్ రామ్ 2), అలాగే మైఖేల్ (కళ్యాణ్ రామ్ 3) ల‌తో పరిచయం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతాయి. అస‌లు మైఖేల్ ఎవ‌రు ? అత‌డు సిద్ధార్థ్‌ను ఎందుకు ? టార్గెట్ చేశాడు ? వీరి మ‌ధ్య‌లో మంజు ఎలా బుక్ అయ్యాడు ? మ‌రి ఈ ముగ్గురి జీవితాలు ఎలా ? ట‌ర్న్ అయ్యాయి అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

అమిగోస్‌ TL విశ్లేష‌ణ :
ఈ సినిమాలో ప్ల‌స్ పాయింట్ల విష‌యానికి వ‌స్తే క‌ళ్యాణ్‌రామ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే చాలా భిన్నంగా తెర‌కెక్కింది ఈ స్టైలీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌ళ్యాణ్‌రామ్ మూడు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించాడు. త‌న స్టైలీష్ లుక్స్‌తో త‌న గ్రేస్ యాక్ష‌న్‌తో చంపేశాడు. క‌ళ్యాణ్ త‌న గ‌త సినిమాల‌తో పోల్చి చూసిన‌ప్పుడు ఈ సినిమాలో ప్రెష్‌గా క‌నిపించాడు. మైఖేల్‌గా క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక క్లైమాక్స్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయి. ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్‌తో పాటు యాక్ష‌న్ సీన్లు బాగా డిజైన్ చేసుకున్నారు.

న‌టీన‌టుల్లో హీరోయిన్ అషికా రంగ‌నాథ్ కూడా త‌న పాత్ర వ‌ర‌కు బాగానే న‌టించింది. బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరితో పాటు మిగ‌గిలిన న‌టులు మెప్పించారు. సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ బాగున్నా దాని చుట్టూ ఉన్న క‌థ‌నం రెగ్యుల‌ర్‌గా, రొటీన్‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబ‌ర్టీ మ‌రీ ఎక్కువుగా తీసుకున్న‌ట్టు ఉంది. ఈ సినిమాలో చూపించిన‌ట్టుగా ఒకేలా ఉన్న ముగ్గురు వ్య‌క్తులు ఒక‌రిగా మ‌రొక‌రు ఎలా ? ఈ స‌మాజంలో చలామ‌ణి అవుతార‌న్న సందేహాలు రాక‌మాన‌వు.

సినిమాలో చాలా చోట్ల స్టైలీష్ మేకింగ్‌కు తోడు ఇంట్ర‌స్టింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ఇక స్క్రీన్ ప్లే కూడా అంతా రొటీన్‌గానే న‌డుస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని లాజిక్ లేని సీన్లు ప‌డ్డాయి. ఫ‌స్టాఫ్‌లో పెద్ద ఎంట‌ర్టైన్‌మెంట్ ఉండ‌దు. హీరోయిన్ పాత్ర‌కు మ‌రీ అంత స్కోప్ లేకుండా చేసేశారు. ద‌ర్శ‌కుడు కూడా మెయిన్ క‌థ‌లోకి ప్ర‌వేశించ‌డానికి పెద్ద‌గా టైం తీసుకోలేదు. హీరో – విల‌న్ స్నేహం, మూడు ప్ర‌ధాన పాత్ర‌ల చుట్టూనే ఎక్కువుగా క‌థ న‌డుస్తుంది.

ఇక ఎక్కా ఎక్కా పాట తెర‌పై బాగుంది. బాల‌య్య ధ‌ర్మ‌క్షేత్రం సినిమాలోని హిట్ సాంగ్ ఎన్నో రాత్రులు వ‌స్తాయి పాట సెకండాఫ్‌లో కీల‌కం. సినిమా మెయిన్ క‌థ అంతా సెకండాఫ్‌లోనే న‌డుస్తుంది. అలాగే మూడు పాత్ర‌ల మ‌ధ్య క‌నెక్ష‌న్ బాగున్నా…. కొన్ని మ‌లుపులు మ‌నం ఊహించేలాగానే ఉంటాయి. సినిమాలో కొన్ని అంశాలు క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అయ్యేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి ఓ కొత్త పాయింటే తీసుకుని స్క్రిఫ్ట్ రాసుకున్నాడు. అయినా మ‌న‌కు మాంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూసిన ఫీల్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు పాయింట్ కొత్త‌ది అయినా క‌థ‌లో డెప్త్ లేదు. బింబిసార సినిమాలోలా హై మూమెంట్స్ లేవు. కొన్ని మ‌లుపులు ఉన్నా అవి ప్రేక్ష‌కుల‌ను ఎగ్జైట్మెంట్ చేసేలా లేవు. జిబ్రాన్ మ్యూజిక్‌లో ఒక‌టి రెండు పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫ‌ర్ ప‌నిత‌నం ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌. ప్ర‌తి ఫ్రేమ్ చాలా ఎఫెక్టిగ్ తీయ‌డంతో పాటు క‌ళ్యాణ్‌రామ్‌ను బాగా చూపించాడు. ఎడిటింగ్ క్రిస్పీగా బాగుంది. మైత్రీ వాళ్ల నిర్మాణ విలువ‌లు గుడ్‌.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :

  • కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం
  • టైట్ స్క్రీన్ ప్లే
  • వైవిధ్య‌మైన క‌థాంశం
  • యాక్ష‌న్ సీన్లు

మైన‌స్ పాయింట్స్ ( – ) :

  • హై ఎలివేష‌న్ స‌న్నివేశాలు లేవు
  • ఊహాజ‌నిత సీన్లు
  • క్లైమాక్స్‌

ఫైన‌ల్‌గా…
అమిగోస్ అంటూ క‌ళ్యాణ్‌రామ్ చేసిన ఈ వైవిధ్య‌మైన సినిమా క‌థాంశం బాగుంది. ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభ‌వం. ఓవ‌రాల్‌గా క‌ళ్యాణ్‌రామ్ త‌న స్టైలీష్ యాక్టింగ్ వేరియేష‌న్‌తో ప్రేక్ష‌కుల‌ను చాలా వ‌ర‌కు మెప్పిస్తాడు. కొన్ని చోట్ల లాజిక్‌లు మిస్ కావ‌డం, స్లో నెరేష‌న్ సీన్లు, సెకండాఫ్ స్క్రీన్ ప్లే సినిమాకు కొంత మైన‌స్‌. యాక్ష‌న్ సీన్లు మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. ఓవ‌రాల్‌గా అమిగోస్‌ను ఒక్క‌సారి చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.

బాట‌మ్ లైన్ : జ‌స్ట్ వ‌న్ టైం వాచ్ థ్రిల్ల‌ర్‌

అమిగోస్‌ TL రేటింగ్ : 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news