MoviesAmigos కళ్యాణ్ రామ్ తో అలా చేయలేను అంటూ .."అమిగోస్" ని...

Amigos కళ్యాణ్ రామ్ తో అలా చేయలేను అంటూ ..”అమిగోస్” ని రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా హీరోగా నటించిన సినిమా “అమిగోస్”. అంతకుముందే బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తుండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నందమూరి అభిమానులు . మరీ ముఖ్యంగా ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ రాజేందర్ రెడ్డి కావడంతో సినిమాను 50-50 ఛాన్సెస్ అంటూ కొందరు ట్రోల్ చేశారు .

అయితే రీసెంట్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ ను అందుకుంది . అంతేకాదు సినిమాలో పలు యాక్షన్ సీన్స్ మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చేసింది . ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాకు ట్విట్టర్లో , సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదటి అనుకునింది అందాల ముద్దుగుమ్మ తమన్నాను అంటూ తెలుస్తుంది .

అయితే సినిమాలో రెండు మూడు ఘాటు సీన్స్ ఉండడంతో ఆమె కళ్యాణ్రామ్ తో అలా చేయలేను అంటూ ఈ మూవీని రిజెక్ట్ చేసిందట . డైరెక్టర్ కూడా కొత్తవాడు కావడంతో తమన్న పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఈ క్రమంలోనే డైరెక్టర్ కన్నడ బ్యూటీ ఆశిక రంగనాధ్ లో రంగంలోకి దించాడు . అయితే కళ్యాణ్ రామ్ చేంజెస్ మేరకే ఆ ఘాటు సీన్స్ ని లేపేసి సినిమాల్లో వల్గారిటీ లేకుండా సాఫీగా తీసుకుపోయేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాట అందరికీ తెగ నచ్చేసింది . ఈ పాటలో మరోసారి బాలయ్యను ఊహించుకుంటూ జనాలు థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే కళ్యాణ్రామ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడిన్నట్లే అని పక్కాగా చెప్పవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news