MoviesPawan Kalyan పవన్ చేసిన పనికి హ్యాట్సాఫ్.. హగ్ చేసుకుంటూ ఎమోషనల్...

Pawan Kalyan పవన్ చేసిన పనికి హ్యాట్సాఫ్.. హగ్ చేసుకుంటూ ఎమోషనల్ అయిన బాలయ్య..!!

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ , రేంజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే . వీళ్ల పేరు చెప్తేనే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . మరీ ముఖ్యంగా వీళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద హంగామ చేస్తారు . భారీ ఫ్లెక్సీలతో భారీ కటౌట్లతో పాలాభిషేకాలతో పూలదండలతో హంగామా చేస్తూ ఉంటారు .

కాగా ఇలాంటి ఇద్దరు హీరోలు ఒకే టాక్ షోలో కనిపిస్తే జనాలకు ఇంతకన్నా ఏం కావాలి. అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన పార్ట్ వన్ ఎపిసోడ్ ఎప్పటినుంచో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా అర్ధరాత్రి నుంచి పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే పొలిటికల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ను లేవదీశారు బాలయ్య . ఈ క్రమంలోనే పవన్ చేసిన మంచి పనికి బాలయ్య ఫిదా అయిపోయాడు.

పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నిలిచాడు.. ఇదే విషయాన్ని షోలో ప్రస్తావించారు బాలయ్య . “మనకు పట్టడం అన్నం పెట్టే రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నీ జెబులో డబ్బులు తీసి ఇచ్చావు చూడవయ్యా.. అదయ్య అది.. నిజంగా నాకు నచ్చేసింది.. హాట్సాఫ్ “అంటూ లేచి నిలుచుని అభినందిస్తూ ఎమోషనల్ గా హగ్ చేసుకున్నారు . ఈ సీన్ చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు . ఇద్దరు స్టార్స్ ను చూసిన పవన్ నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . కాగా ఈ షో లోనే వృద్ధురాలు పవర్ స్టార్ సీఎంగా చూడాలని .. అలా చూసిన తర్వాతే నేను చనిపోతానని చెప్పుకోవడం షోకే హైలెట్గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news