MoviesPrabhas ప్ర‌భాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్‌.. ఫ్యాన్స్‌లో టెన్ష‌న్‌..!

Prabhas ప్ర‌భాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్‌.. ఫ్యాన్స్‌లో టెన్ష‌న్‌..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులే చేస్తున్నాడు. ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం ఉన్న‌వి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు పాన్ ఇండియా లెవ‌ల్లోనే అంచ‌నాలు ఉంటున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో మామూలు సినిమాలు లేవు. ఓ వైపు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ ఉంది. ఇక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న స‌లార్ 1, 2తో పాటు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ప్రాజెక్ట్ కే సైతం తెర‌కెక్క‌నుంది.

ఈ మూడు సినిమాలు కూడా సెట్స్ మీద న‌డుస్తూనే ఉన్నాయి. మ‌ధ్య‌లోనే మారుతి డీల‌క్స్ రాజాను కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వంగ సందీప్‌రెడ్డి సినిమా ఉండ‌నే ఉంది. ఇక ప‌ఠాన్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించే సినిమా ఉండ‌నే ఉంది. ఇన్నీ క్రేజీ ప్రాజెక్టుల‌తో క‌నీసం పెళ్లి అన్న మాటే లేకుండా ప్ర‌భాస్ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌పై వంద‌ల కోట్లు కాదు … వేల కోట్ల బిజినెస్ న‌డుస్తోంది.

అలాంటి టైంలో ప్ర‌భాస్ ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస షూటింగ్‌లతో ఆరోగ్యంపై కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేద‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తీవ్రమైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా తెలుస్తోంది. అందుకే మ‌నోడు న‌టిస్తోన్న అన్నీ షూటింగ్‌లు క్యాన్సిల్ అయిపోయాయి. డాక్ట‌ర్లు కూడా 10 రోజుల వ‌ర‌కు రెస్ట్ తీసుకుంటే త‌ప్పా కోలుకోడ‌ని చెప్పేశార‌ట‌.

అందుకే షూటింగ్‌లు అన్నీ క్యాన్సిల్ చేసేసుకుని హాస్ప‌ట‌ల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ… ఇంటి వ‌ద్ద‌నే చికిత్స తీసుకుంటున్నాడ‌ట‌. మారుతి సినిమా ఈ నెల‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. ప్ర‌భాస్ అనారోగ్యంతో ఉండ‌డంతో ఈ సినిమా షెడ్యూల్ వాయిదా వేసేసిన‌ట్టు తెలిసింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస‌గా షూటింగ్‌ల‌తో ఉండ‌డం వ‌ల్లే ప్ర‌భాస్ ఇంత ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని.. అభిమానులు మ‌రీ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news