MoviesJR NTR ఆ స్టార్ హీరో తో చేతులు కలిపిన ఎన్టీఆర్.....

JR NTR ఆ స్టార్ హీరో తో చేతులు కలిపిన ఎన్టీఆర్.. ఇక అరాచకానికి అమ్మ మొగుడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువైపోతున్నాయి . సింగిల్ గా నటించి ఫ్లాప్ అందుకోవడం కన్నా.. మరో హీరోతో జతకట్టి మల్టీ స్టారర్ గా తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు స్టార్ హీరోస్ . కాగా మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లోనూ ..కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. మార్కెట్ బాగా పెంచేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.

అంతేకాదు ఏకంగా ఆస్కార్ కి నామినేట్ అయి అందరి అటాక్షన్ ను గ్రాబ్ చేసింది . ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా ఇప్పటికే కొరటాలతో ఎన్టీఆర్ 30 , ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 కి కమిట్ అయిన ఎన్టీఆర్ రీసెంట్గా ఓ అదిరిపోయే మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈసారి ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేతులు కలిపాడు అంటూ సినీ వర్గాలనుంచి సమాచారం అందుతుంది .

మనకు తెలిసిందే ధనుష్ కోలీవుడ్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడో.. మాస్ హీరోలకు పెట్టింది పేరుగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక అలాంటి మాస్ హీరోతో ఎన్టీఆర్ జతకడితే ఎలా ఉంటుంది ..అరాచకానికి అమ్మ మొగుడులానే ఉంటుంది ..బాక్సాఫీస్ బద్దల అవ్వాల్సిందే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. కాగా వీళ్ళిద్దరితో సినిమాను తెరకెక్కించాలని ఆలోచన వచ్చింది తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ కి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకి ఎన్టీఆర్ – ధనుష్ ఇద్దరు సైన్ చేసినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారట . ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టే ఆలోచనలు ఉన్నారట మేకర్స్ . ఈ న్యూస్ కోలీవుడ్ మీడియా నుంచి ప్రముఖంగా వినిపిస్తుంది . అయితే ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ధనుష్ – తారక్ ఇద్దరిని ఒకే తెరపై చూస్తే మాత్రం సీన్ చిరిగిపోవాల్సిందే అంటున్నారు కోలీవుడ్ జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news