MoviesKirak RP కిరాక్ ఆర్పీ "పులుసు" పిండేసిన రాకింగ్ రాకేష్.. ఆ...

Kirak RP కిరాక్ ఆర్పీ “పులుసు” పిండేసిన రాకింగ్ రాకేష్.. ఆ మాటలు వినలేం రా బాబోయ్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఏదైనా ట్రెండ్ అవుతుంది అంటే అది కేవలం జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి స్టార్ట్ చేసిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ . ఏంటో ఈ మధ్యకాలంలో కిరాక్ ఆర్పి ఏం మాట్లాడిన తప్పుగానే చూస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఆయన జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా ఈ షో లు ఏమి వద్దు అంటూ బిజినెస్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ హైదరాబాద్ లో ఓ కర్రీస్ పాయింట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే .

కాగా స్టార్టింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయిన ఈ బిజినెస్ ..ఇప్పుడు అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటుంది . కొందరు కావాలనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పై ట్రోల్ చేస్తున్నారు అంటూ కిరాక్ ఆర్పి చెప్పుకొస్తున్నారు. చేపల పులుసులో టేస్ట్ బాగా రావడానికి రకరకాల పౌడర్స్ వాడుతున్నారని.. అలాంటి పౌడర్స్ వాడడం వల్ల కర్రి టేస్ట్ బాగొచ్చిన రానున్న రోజుల్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని .. పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే తోటి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు కిరాక్ ఆర్పి.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పై క్వశ్చన్ ఎదురయింది . ఈ క్రమంలోనే అది టోటల్గా మల్లెమాల బిక్ష అంటూ కొట్టి పడేసాడు . అంతే కాదు ఈ మధ్యకాలంలో మీరు ఆర్పిని కలిసారా ..? అంటూ హోస్ట్ అడగ్గా ..చాలా వ్యంగ్యంగా స్పందిస్తూ..” మేము ఎక్కడ ..వాళ్ళు ఎక్కడ ..మేము ఏదో చిన్న ఆర్టిస్టులం ..వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు “అంటూ చాలా సెటైరికల్ గా కౌంటర్ వేశారు. ఇలాగే ఆయన గురించి అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో సరదాగా స్కిట్స్ చేశారు. మరి అలాంటి మంచి స్నేహితుల మధ్య ఇలాంటి గొడవలు ఎందుకు వచ్చాయా అని జనాలు చర్చించుకుంటున్నారు . ఏది ఏమైనా ఒక్క మాటతో కిర్రాక్ ఆర్పి పులుసు పిండేసాడు అంటూ ఆర్పిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news