MoviesKalyan Ram నిర్మాత‌గా క‌ళ్యాణ్‌రామ్ అన్ని కోట్లు న‌ష్ట‌పోయాడా… ఈ లెక్క‌లు...

Kalyan Ram నిర్మాత‌గా క‌ళ్యాణ్‌రామ్ అన్ని కోట్లు న‌ష్ట‌పోయాడా… ఈ లెక్క‌లు చూస్తే మాటేరాదు..!

నందమూరి హీరోలలో అందరు హీరోలు మాస్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేయగా కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవైపు కళ్యాణ్ రామ్ హీరోగా బిజీగా ఉన్నా మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతగా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బావ కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ బ్యానర్ కు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.

వాస్తవానికి కళ్యాణ్ రామ్ తో సినిమాలను నిర్మించాలని ఆశ పడుతున్న నిర్మాతల సంఖ్య తక్కువేం కాదు. అయితే రిస్కీ ప్రాజెక్ట్ లను, కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా నష్టం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా ఆ భారం ఎవరిపై పడకుండా కళ్యాణ్ రామ్ జాగ్రత్త పడతారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్ తన సినిమాల హక్కులను తక్కువ మొత్తానికే విక్రయిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార బిగ్గెస్ట్ హిట్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను కళ్యాణ్ రామ్ కేవలం 10 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తానికి అమ్మారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటివరకు 10 సినిమాలు తెరకెక్కగా ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాల షూటింగ్స్ మొదలుకావాల్సి ఉంది.

ఈ బ్యానర్ లో తెరకెక్కిన అతనొక్కడే, పటాస్, జై లవకుశ, బింబిసార సినిమాలు సక్సెస్ సాధించగా జయీభవ, ఓం 3డీ, కిక్ 2 సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. హరేరామ్, కళ్యాణ్ రామ్ కత్తి, ఇజం సినిమాలు అంచనాలను అందుకోలేకపోయినా భారీ నష్టాలను మిగల్చలేదు. కళ్యాణ్ రామ్ కు తను నిర్మించిన సినిమాల ద్వారా రు. 70 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని సమాచారం.

అయితే జై లవకుశ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే నిర్మించడం ద్వారా కళ్యాణ్ రామ్ కు ఆ నష్టాలు భర్తీ అయ్యాయి. జై లవకుశ సినిమాకు తారక్ తన మార్కెట్ కంటే తక్కువగానే పారితోషికం తీసుకున్నారట.
అలాగే ఈ సినిమాకు ప‌నిచేసిన డైరెక్ట‌ర్, హీరోయిన్లు అంద‌రికి చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్లు ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతోనే క‌ళ్యాణ్‌రామ్ న‌ష్టాల నుంచి, బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇవ్వాల్సిన మొత్తాల నుంచి బ‌య‌ట‌ప‌డిపోయాడు.

అన్న కళ్లలో ఆనందం చూడాలని తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ పేరు నిర్మాతగా కూడా మారుమ్రోగుతుందని చెప్పవచ్చు.

Latest news