MoviesTarakaratna బ్రేకింగ్: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం .. తిరిగిరాని లోకాలకు...

Tarakaratna బ్రేకింగ్: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం .. తిరిగిరాని లోకాలకు తారకరత్న..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు చేదు వార్తనే చెప్పాలి . గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారక రామారావు గారి మనవడు .. నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. కాగా నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న.. అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్ కి తరలించగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోకి తరలించారు .

ఈ క్రమంలోని అక్కడ చికిత్స తీసుకుంటున్న తారకరత్న హెల్త్ బాగుందని కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు . అయితే ఎవరూ ఊహించిన విధంగా గత 48 గంటల నుంచి తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించింది. కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్న ట్రీట్మెంట్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు . అంతేకాదు తారకరత్న కోసం కర్ణాటక హెల్త్ మినిస్టర్ ప్రత్యేకంగా ఫారిన్ డాక్టర్లను కూడా ఇండియాకి రప్పించారు .

అయినా సరే లాభం లేకుండా పోయింది . ట్రీట్మెంట్ తీసుకుంటూ తారకరత్న కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈ విషాద మరణ వార్తతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోయారు . ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్న నందమూరి బాలకృష్ణ శోకసంద్రంలో మునిగిపోయారు . అంతేకాదు కొద్దిసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కూడా హాస్పిటల్ కి బయలుదేరుతున్నట్లు సమాచారం అందుతుంది . నందమూరి తారకరత్న మరణం పై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news