MoviesJR NTR అబ్బాబ్బా..ఏంటి ఇది..ఎన్టీఆర్ వాళ్లిద్దరి మధ్య లో నలిగిపోతున్నాడే..!!

JR NTR అబ్బాబ్బా..ఏంటి ఇది..ఎన్టీఆర్ వాళ్లిద్దరి మధ్య లో నలిగిపోతున్నాడే..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ అటు ఫ్యాన్స్ మధ్య ఇటు డైరెక్టర్స్ మధ్య నలిగిపోతున్నాడు అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు .

సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి నెలలు గడుస్తున్న ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోవడం పై నందమూరి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్గా అమిగోస్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఏదైనా అప్డేట్ ఉంటే మీకే చెప్తామంటూ ఓపెన్ గానే చెప్పాడు . దయచేసి మేకర్స్ ని ఇబ్బంది పెట్టకండి అంటూ వార్నింగ్ ఇస్తూ రిక్వెస్ట్ చేశారు .

అయితే తెర వెనకాల మేకర్స్ , డైరెక్టర్స్ తారక్ ని చాలా ఇబ్బంది పెట్టారని .. ఈ కారణంగానే అసహనానికి లోనైన తారక్ స్టేజిపై సుమ మీద కూడా సీరియస్ అయ్యాడని తెలుస్తుంది . అంతేకాదు తారక్ జనాలకి నచ్చిన విధంగా కంటెంట్ ని ఇవ్వడానికి ట్రై చేస్తుంటే ..మేకర్స్ ఆ విషయంలో అడ్డుపడుతున్నారట . కమర్షియల్ గా ఆలోచించే మేకర్స్ ..తారక్ ఆలోచనలను తొక్కేస్తున్నారని ..ఈ విషయాన్ని బయటికి చెప్పలేక అటు ఫాన్స్ ని మెప్పించలేక ఇటు డైరెక్టర్స్ కి నో చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఆ కారణంగానే ఎన్టీఆర్ థర్టీ సినిమా ఇన్ని నెలలు వాయిదా పడిందని తెలుస్తుంది . ఏది ఏమైనా సరే తారక్ లో ఉన్న మంచితనాన్ని డైరెక్టర్స్ వాడేసుకుంటున్నారు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు . దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news