MoviesAmigos Review కళ్యాణ్ రామ్ అమిగోస్ : హిట్టా..ఫట్టా..?

Amigos Review కళ్యాణ్ రామ్ అమిగోస్ : హిట్టా..ఫట్టా..?

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా హీరోగా నటించిన సినిమా అమిగోస్.. కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కళ్యాణ్రామ్ అమిగోస్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకొని ఉన్నారు జనాలు . కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

టైటిల్ తోనే ఓ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన అమిగోస్ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది . నిజానికి ఆవిగోస్ అంటే స్పానిష్ భాషలో ఫ్రెండ్ అని అర్థం . మూవీ కాన్సెప్ట్ పక్కాగా చెప్పాలంటే ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని టాక్ ఉంది. అమిగోస్ మూవీలో ప్రతి ఒక్కరూ తమలా ఉండే వ్యక్తులను కలిస్తే సాఫ్ట్వేర్ ని హీరో డెవలప్ చేస్తాడు. ఈ క్రమంలోనే తబను తనలా ఉన్న మరో ఇద్దరిని కలుస్తాడు .. అయితే అది ఎవరు ..వాళ్లకి ఉన్న సంబంధం ఏంటి .. ఈ క్రమంలోనే వారి మధ్య వచ్చిన తగాదాలు ఏంటి.. ఫైనల్లీ అలా కలుసుకోవడం వల్ల మనిషికి నష్టమా..? లాభమా..? అనేది ఫైనల్ స్టోరీ .

కాగా సినిమా మొత్తానికి కళ్యాణ్ రామ్ నటన సూపర్ అనే చెప్పాలి . ఆశిక రంగనాథ్ కూడా ఈ సినిమాల్లో మంచిగా గ్లామర్ క్వీన్ అని పేరు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ప్రేక్షకులకు నచ్చిన యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి . కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండడంతో జనాలకి నచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి . మరీ ముఖ్యంగా అన్ని పాటల్లోకి బాలయ్య సినిమాలోని పాటని రీమేక్ చేసిన “ఎన్నో రాత్రులు వస్తాయి ” కానీ పాట సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అయింది పక్కాగా చెప్పాలంటే .. అమిగోస్ తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి కళ్యాణ్ రామ్.. చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news