MoviesJR NTR జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక‌పోతే అలా సెటిల్ అయ్యేవాడా…!

JR NTR జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక‌పోతే అలా సెటిల్ అయ్యేవాడా…!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో తారక్ పేరిట ఎన్నో చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి. సరైన సమయం వస్తే పాలిటిక్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో తన సినిమాల గురించి, సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారనే ప్రశ్నల గురించి స్పష్టత ఇచ్చారు.

ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే బిజినెస్ మేన్ గా కెరీర్ ను కొనసాగించి ఉండేవాడినని తారక్ అన్నారు. ఒకవేళ సినిమాల్లోకి వచ్చి ఇక్కడ సక్సెస్ కాకపోయి ఉంటే మాత్రం ఈ ఇండస్ట్రీకే పరిమితం అయ్యేవాడినని లైట్ బాయ్ గా అయినా కెరీర్ ను కొనసాగించేవాడినని తారక్ పేర్కొన్నారు. అయితే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తారక్ తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు తారక్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

వరుస ఫ్లాపుల వల్ల తారక్ మార్కెట్ తగ్గిందని కామెంట్లు వినిపించిన ప్రతి సందర్భంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ తో తనేంటో తారక్ ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలలో నటించింది కళ్యాణ్ రామ్ అని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువ ప్రయోగాత్మక సినిమాల్లో నటించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

తారక్ చేసిన కామెంట్లు కొంతమంది అభిమానులకు నచ్చని నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు అప్ డేట్ అడిగితే తారక్ సీరియస్ కావడం ఎప్పుడూ జరగలేదని ఆరోగ్య సమస్యల వల్లే తారక్ సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాలు జరగనుండటంతో తారక్ అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news