Moviesప్రపంచాని ఊపేసిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ కు రంగం సిద్థం..హీరో ఎవరో...

ప్రపంచాని ఊపేసిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ కు రంగం సిద్థం..హీరో ఎవరో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే..!!

మైకేల్ జాక్సన్ ఈ పేరు చెబుతుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది . మనలో మనకే తెలియని పూనకాలు వచ్చేస్తాయి . మాట్లాడుతుంటేనే కళ్ళల్లో నీళ్లు.. కాళ్లల్లో డాన్స్ అవి అంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. కొన్నేళ్లపాటు ప్రపంచ సంగీతాన్ని శాసించిన సంగీత చక్రవర్తిగా పేరు సంపాదించుకున్న కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్.. ప్రపంచాన్ని తన పాటలతో రకరకాల స్టెప్పులతో ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికీ మైకేల్ జాక్సన్ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు . కాగా తన మ్యూజిక్ టాలెంట్ తో మంచి కిక్కెక్కించిన మైకేల్ జాక్సన్ మరణం సంగీతం అభిమానులకు తీవ్ర విషాదంలోకి నెట్టేసింది ..మైఖేల్ జాక్సన్ బయోపిక్ న్యూస్ తెరపై చాలా రోజుల నుందీ వైరల్ అవుతుంది. కాగా ఎట్టకేలకు మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు మేకర్స్.

కాగా మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. జాక్సన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లు లయన్గేట్ సంస్థ ప్రకటించింది . మైకేల్ జాక్సన్ బయోపిక్ ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గ్రహం కింగ్ నిర్మించనున్నారు . అంతేకాదు ఇందులో జాక్సన్ పాత్రలో జాఫర్ జాక్సన్ నటించబోతున్నారు. జాఫర్ జాక్సన్ ఎవరో కాదు మైకేల్ జాక్సన్ సోదరుడు కొడుకే,

ఇతనే కరెక్ట్ అంటూ మేకర్స్ ఫిక్స్ అయ్యారు . ఈ కారణంగానే ఇతగాడిని సెలెక్ట్ చేశారు . అంతేకాదు దీనికి నెటిజన్స్ నుంచి కూడా మంచి అప్లోజ్ వస్తుంది . కాకపోతే ఓవర్ టాబ్లెట్లు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మైకల్ జాక్సన్ చనిపోయారు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరి ఈ విషయాన్ని సినిమాలో ఏ విధంగా చూపిస్తారో.. ఆ విషయాన్ని జనాలు ఎంత వరకు తీసుకుంటారో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news