Movies"జగడం" సినిమా రామ్ చేసాడు కాబట్టే ఫ్లాప్..ఆ హీరో చేసుంటే బాక్స్...

“జగడం” సినిమా రామ్ చేసాడు కాబట్టే ఫ్లాప్..ఆ హీరో చేసుంటే బాక్స్ ఆఫిస్ బద్ధలైయేది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏదైనా సరే నేను మొహమాటంగా ఫేస్ మీద చెప్పేస్తున్నాను. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే .. తమకు నచ్చకపోతే నచ్చలేదు అంటూ చెప్పి ట్రోల్ చేస్తున్నారు . అంతేనా సరాసరి ఆ స్టార్ హీరోని ట్యాగ్ చేస్తూ అతగాడి పరువు తీసేస్తున్నారు. రీసెంట్గా అదే సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ . మనకు తెలిసిందే రామ్ తన కెరీర్లు ఎన్నో సినిమాలు చేశాడు . చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అతి కొద్ది సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి .

కాగా అందులో ఒకటే రామ్ నటించిన జగడం సినిమా. ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ సుకుమార్ .. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత జగడం సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు సుకుమార్ .

నిజానికి దిల్ రాజుకి జగడం కథ చెబితే ఆ కథ సరిగ్గా లేదని చెప్పి దిల్ రాజు కథ మార్పు చేసి సినిమా చేద్దాం అనడంతో సుకుమార్ కి అస్సలు నచ్చలేదట . ఇంత మంచి కథ మార్చడానికి మనసు రాక.. దిల్ రాజుతో వాదించలేక సుకుమార్ వేరే ప్రొడ్యూసర్ తో జగడం సినిమాను రిలీజ్ చేశాడు. కాగా ముందుగా ఈ సినిమాలో హీరోగా అనుకునింది మహేష్ బాబునట ..స్టోరీ కూడా చెప్పారట అయితే మహేష్ బాబుకు..ఈ కథ నచ్చక.. ఈ సినిమా రిజెక్ట్ చేశారట .

ఇక తర్వాత అలా ఆ స్టోరీ రామ్ వద్దకు చేరింది . అయితే ఈ స్టోరీ రామ్ చేయడం కంటే మహేష్ బాబు చేసుంటేనే బాగుండేది అన్నది నెటిజన్స్ అభిప్రాయం . ఒకవేళ నిజంగా మహేష్ బాబు ఈ సినిమా చేసి ఉంటే కచ్చితంగా కాస్తో కూస్తో ఈ సినిమా హిట్ అయి ఉండేది . ఈ సినిమా రామ్ చేయడంతో పూర్తిగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో కచ్చితంగా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news