Moviesబాల‌య్య వీర‌సింహాకు చిరు వీర‌య్య‌ను మించిన లాభాలే.... ఇదే అస‌లు తేడా...!

బాల‌య్య వీర‌సింహాకు చిరు వీర‌య్య‌ను మించిన లాభాలే…. ఇదే అస‌లు తేడా…!

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ట న‌టించిన రెండు సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరు వాల్తేరు వీర‌య్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. రెండు సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చింది. రెండు సినిమాలు చాలా స్పీడ్‌గా రు. 100 కోట్ల గ్రాస్‌లోకి చేరిపోయాయి. బాల‌య్య సినిమా ఫ‌స్ట్ డే ఏకంగా రు. 54 కోట్ల వ‌సూళ్లు సాధించింది. త‌ర్వాత రెండు రోజులు వ‌రుస‌గా వీర‌య్య‌, వార‌సుడు సినిమాలు రావ‌డంతో కాస్త డ్రాప్ అయ్యింది.

రెండు సినిమాల వ‌సూళ్లు కాస్త అటూ ఇటూగా రు. 120 కోట్ల గ్రాస్‌ను దాటేశాయి. ఇక పండ‌గ అయిపోయింది. బుధ‌వారం నుంచి ఈ రెండు సినిమాల‌కు అస‌లు టెస్ట్ స్టార్ట్ కానుంది. అయితే పైకి మాత్రం వీర‌య్య‌కు లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని.. వీర‌సింహా రెడ్డికి అనుకున్నంత లాంగ్ ర‌న్ ఉండ‌న్న ప్ర‌చారం అయితే న‌డుస్తోంది. పైకి ఫిగ‌ర్స్ వీర‌య్య‌కే కాస్త ఎక్కువ క‌నిపిస్తున్నా… వీర‌సింహాకే ఎక్కువ లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వీర‌సింహారెడ్డితో పోలిస్తే వీర‌య్య‌కు 150కు పైగా థియేట‌ర్లు ఎక్కువ ఇచ్చారు. అక్క‌డ గ్రాస్ ఫిగ‌ర్స్ ఎక్కువుగా ఉన్న వీర‌య్య‌కు థియేట‌ర్ల అద్దెలు, ట్యాక్స్‌లు పోతే వ‌చ్చే షేర్ త‌క్కువుగా ఉండ‌నుంది. వీర‌సింహారెడ్డికి ఈ విష‌యంలో చాలా ప్ల‌స్‌. మ‌రో విష‌యం ఏంటంటే అన్ని చోట్లా.. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు బుకింగ్స్ విష‌యంలో రెండు సినిమాల‌కు 5 % మిన‌హా పెద్ద తేడా లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసి చూస్తే ఈ విష‌యం క్లీయ‌ర్‌గా తెలుస్తోంది.

పైగా వీర‌సింహారెడ్డితో పోలిస్తే వీర‌య్య‌కు అయిన బ‌డ్జెట్ చాలా ఎక్కువ‌. ర‌వితేజ‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌నే రు. 17 కోట్లు.. మేకింగ్ కాస్ట్ వీర‌య్య‌కు చాలా ఎక్కువ అయ్యింది. దాని ప్రి రిలీజ్ బిజినెస్ కూడా రు. 15 – 20 కోట్లు ఎక్కువ జ‌రిగింది. అందుకే ఆ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌డితేనే వీర‌య్య బ్రేక్ ఈవెన్ అయ్యి.. లాభాలు రాబ‌డుతుంది. వీర‌సింహా ఇప్ప‌టికే రు. 60 కోట్ల షేర్ దాటేసింది. మ‌రో రు. 15 కోట్లు షేర్ వ‌స్తే బ్రేక్ ఈవెన్ అయిపోయిన‌ట్టే..!

వీర సింహా రెడ్డి'ని తొక్కిపడేసిన 'వాల్తేరు వీరయ్య'.! - Mudra369

అదే వాల్తేరు వీర‌య్య‌కు రు. 90 కోట్ల‌కు పైగా షేర్ వ‌స్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు భారీ వ‌సూళ్లు రావ‌డంతో నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌కు వ‌చ్చిన ఇబ్బంది అయితే లేదు. రెండో వారంలోనూ రెండు సినిమాలు స్ట‌డీగానే వ‌సూళ్లు రాబ‌ట్టేలా ఉన్నాయి. మ‌రి ఫైన‌ల్ ర‌న్‌లో ఏ సినిమాతో ఎక్కువ లాభాలు వ‌స్తాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news