Moviesహైద‌రాబాద్‌లో వీర‌సింహా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లతో టాలీవుడ్ రికార్డ్‌... ఏందిరా సామీ...

హైద‌రాబాద్‌లో వీర‌సింహా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లతో టాలీవుడ్ రికార్డ్‌… ఏందిరా సామీ బాల‌య్య గ‌ర్జ‌న‌..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్‌, యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ వీర‌సింహారెడ్డి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అదిరిపోయే ప్రి రిలీజ్ బ‌జ్ తెచ్చుకుంది. బాల‌య్య అఖండ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత చేసిన సినిమా కావ‌డంతో పాటు ఇటు మ‌లినేని గోపీచంద్ క్రాక్ లాంటి మాసీవ్ హిట్ త‌ర్వాత తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో హైప్ మామూలుగా లేదు.

దీనికి తోడు అన్‌స్టాప‌బుల్ షోల‌తో బాల‌య్య‌కు ఇటీవ‌ల కాలంలో మామూలు ఇమేజ్ రాలేదు. బాల‌య్య‌కు స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు టైంలో ఎంత పీక్ ఇమేజ్ ఉందో ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ర‌హా ఇమేజ్ క‌న‌ప‌డుతోంది. ఎక్క‌డ చూసినా జై బాల‌య్య స్లోగ‌న్ హైలెట్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే వీర‌సింహారెడ్డి ఏపీ, తెలంగాణ నుంచి ఓవ‌ర్సీస్ వ‌ర‌కు ఎక్క‌డ చూసినా తొలి రోజు వ‌సూళ్లు దుమ్ము దులిపేసింది.

ఫ‌స్ట్ డే హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చాలా లిమిటెడ్ టిక్కెట్ ధ‌ర‌ల‌తో కూడా సెన్షేష‌న‌ల్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కే స‌రికొత్త షాక్ ఇచ్చింది. ఫ‌స్ట్ డే ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేట‌ర్ల‌లోనే ఏకంగా రు. 43 ల‌క్ష‌ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇది టాలీవుడ్‌లో ఇది వ‌ర‌కు వ‌చ్చిన భారీ సినిమాల‌తో దాదాపు స‌మానం అంటున్నారు.

పైగా ఆ భారీ సినిమాల‌కు టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువ‌. లిమిటెడ్ రేట్ల‌తోనే ఆ ఏరియాలో ఈ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టిన వీర‌సింహా టిక్కెట్ రేట్లు పెంచుకుని వ‌స్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హిస్ట‌రీలోనే ఆల్ టైం – 3 బిగ్గెస్ట్ గ్రాస‌ర్స్‌లో ఒక్క‌టిగా నిలిచి ఉండేద‌ని అంటున్నారు. ఇప్పుడు వీర‌సింహారెడ్డి ప్లేస్ 4లో నిలిచింది. ఏదేమైనా బాల‌య్య సినిమాకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ డే ఏకంగా రు. 43 ల‌క్ష‌ల గ్రాస్ అంటే అది మామూలు గ‌ర్జ‌న కాదు.. వీర‌సింహ గ‌ర్జ‌నే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news