Moviesపూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ = దిల్ రాజు వార‌సుడు... సోష‌ల్ మీడియాలో...

పూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ = దిల్ రాజు వార‌సుడు… సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఆట.. నెటిజ‌న్ల వేట‌..!

టాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇండస్ట్రీలో చాలామందికి టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా థియేటర్లను తన గుప్పిట్లో ఉంచుకొని సినిమా రిలీజ్ డేట్లను శాసిస్తూ… చివరకు స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు ? రిలీజ్ అవ్వాలి ఏ సినిమాకు ఎన్ని ? థియేటర్లు కేటాయించాలని విషయంలో అంతా దిల్ రాజే చేస్తున్నారని విమర్శలు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి.

ఇక ఈ సంక్రాంతికి ఇద్ద‌రు పెద్ద హీరోలు బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య రెండు సినిమాలు ఉన్నా కూడా దిల్ రాజు కోలీవుడ్ హీరో విజ‌య్‌తో తీసిన వార‌సుడు సినిమాకే ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చేస్తార‌న్న టాక్ ముందు నుంచి ఉంది. రాజు మాట‌లు కూడా అలాగే ఉండ‌డంతో అస‌లు వీర‌య్య‌, వీర‌సింహాకు అనుకున్న రేంజ్‌లో థియేట‌ర్లు దొరుకుతాయా ? అన్న డౌట్లే ఉన్నాయి. రాజు కూడా ఎవ‌రి సినిమా వాళ్ల‌ది ? ఎవ‌రి వ్యాపారం వారిదే అన్న‌ట్టుగా మాట్లాడారు.

అయితే చివ‌ర్లో ట్విస్ట్‌… రాజు అనూహ్యంగా వార‌సుడు తెలుగు వెర్ష‌న్‌ను 14కు మార్చేశారు. త‌మిళ్‌లో మాత్రం ముందుగా అనుకున్న‌ట్టు 11నే రిలీజ్ అయ్యింది. చిరు, బాల‌య్య సినిమాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే త‌న సినిమాను వాయిదా వేసుకున్న‌ట్టు రాజు చెప్పారు. ఏదేమైనా త‌న సినిమా కంటెంట్ మాట్లాడుతుంద‌ని రాజు ధీమా వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే త‌మిళ వెర్ష‌న్ వ‌రీసుకు అనుకున్నంత టాక్ రాలేదు.

సినిమా ప్లాప్ అంటున్నారు. మామూలుగా విజ‌య్ సినిమాల‌కు త‌మిళ‌నాడులో ప్లాప్ అయినా కూడా రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌స్తాయి. అస‌లు బీస్ట్ సినిమా ఎంత పెద్ద డిజాస్ట‌రో చూశాం. ఆ సినిమాకే ఫ‌స్ట్ డే ఏకంగా రు. 87 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. అదే వ‌రీసుకు కేవ‌లం రు. 46 కోట్లే వ‌చ్చాయి. కేవ‌లం రు. 23 కోట్ల షేర్ వ‌చ్చింది. దీనిని బ‌ట్టి చూస్తే వ‌రీసు త‌మిళ ప్రేక్ష‌కుల‌కే న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది.

పైగా అదే రోజు మ‌రో స్టార్ హీరో అజిత్ తునివు కూడా వ‌చ్చింది. ఈ సినిమాకే ఎక్కువ థియేట‌ర్లు ద‌క్కాయి. అజిత్ సినిమా కూడా విజ‌య్ సినిమా వ‌సూళ్ల‌పై పెద్ద దెబ్బ వేసింది. పైగా త‌మిళ్‌లో విజ‌య్ సినిమాకు ప్లాప్ టాక్ వ‌చ్చేసింది. ఇప్పుడు హిందీ, తెలుగులో లేట్‌గా రిలీజ్ చేస్తున్నారు. అస‌లే వార‌సుడు ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా సినిమా మ‌న తెలుగు సినిమాల‌ను క‌లిపి మిక్స్ చేసి తీసిన‌ట్టుగా ఉందంటున్నారు. ఇలాంటి టైంలో వార‌సుడు తెలుగులో మ‌రింత డిజాస్ట‌ర్ అవుతుంద‌నే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

పైగా వార‌సుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 139 కోట్ల షేర్ రావాలి. అది ఏ మాత్రం సాధ్యం కాదు. వార‌సుడు తెలుగు కూడా రిలీజ్ అయిపోతే మ‌రో లైగ‌ర్ అవుతుంద‌నే అంటున్నారు. లైగ‌ర్ దెబ్బ‌తో పూరి జ‌గ‌న్నాథ్ ఎలా ? ట్రోల్ అయ్యాడో ఇప్పుడు అస‌లే కోపం మీద ఉన్న టాలీవుడ్ జ‌నాలు, తెలుగు సినీ అభిమానులు దిల్ రాజును కూడా అదేలా ట్రోల్ చేస్తారంటున్నారు. అయితే మ‌రి రాజు జాత‌కం ఎలా ? ఉందో శ‌నివారం వార‌సుడు రిజ‌ల్ట్‌తో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news