Movies' వీర‌సింహారెడ్డి ' కి 3 రివ్యూలు వ‌చ్చేశాయ్‌... మూడింట్లోనే ఒక్క‌టే...

‘ వీర‌సింహారెడ్డి ‘ కి 3 రివ్యూలు వ‌చ్చేశాయ్‌… మూడింట్లోనే ఒక్క‌టే టాక్ వ‌చ్చిందే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు కేవ‌లం 8 రోజుల టైం మాత్ర‌మే ఉంది. అంచ‌నాలు మామూలుగా లేవు. సాంగ్స్‌, స్టిల్స్ అయితే సినిమాను ఎక్క‌డితో తీసుకువెళ్లాయి. ఇక ఇప్పుడు సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి దిగుతుందా ? అన్నది మాత్ర‌మే ఉంది. మ‌రోవైపు వీర‌సింహాకు పోటీగా వ‌స్తోన్న చిరంజీవి వాల్తేరు వీర‌య్య ఇప్ప‌టికే సెన్సార్ కంప్లీట్ చేసుకోవ‌డంతో పాటు ప్ర‌మోష‌న్ల‌లో స్పీడ్‌గా ఉంది.

ఇక బాల‌య్య వీర‌సింహాకు సెన్సార్ కంప్లీట్ కాలేదు. ఈ నెల 6న ఏపీలోని ఒంగోలులు వీర‌సింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఆ రోజు ట్రైల‌ర్ లాంచ్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక మాస్ మొగుడు సాంగ్ ప‌ల్ల‌వి కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో అస‌లు బాల‌య్య ఫ్యాన్స్‌ను ఆపేలా లేం. ఈ సినిమా సెన్సార్ జ‌ర‌గ‌కుండానే అప్పుటే బ‌య‌ట‌కు 3 రివ్యూలు వ‌చ్చేశాయి.

మూడు రివ్యూల్లోనూ సినిమాకు అదిరిపోయే టాక్ వ‌చ్చింది. ముందుగా ఈ సినిమా మాట‌ల ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ అయితే సంక్రాంతికి వీర‌సింహారెడ్డే విన్న‌ర్ అని నొక్కి మ‌రీ చెపుతున్నారు. తాను ఈ సినిమా స్టోరీ కంప్లీట్ చేసేందుకు 2 నెల‌ల టైం తీసుకున్నాన‌ని.. డైలాగులు మాత్రం అదిరిపోయాయ‌ని.. అస‌లు ప్ర‌తి సీన్లోనూ డైలాగులు వింటుంటే గూస్‌బంప్స్ వ‌స్తాయ‌ని ఆయ‌న చెపుతున్నారు. తాను ఇప్ప‌టికే సినిమా చూశాన‌ని.. మామూలుగా లేద‌ని త‌న రివ్యూ ఇచ్చేశారు.

ఇక వీర‌సింహారెడ్డి సినిమాటోగ్ర‌ఫీ చేసిన రిషి పంజాబీ విజువ‌ల్ ఫీస్ట్ అని.. సినిమాలో చాలా సీన్ల‌కు గూస్‌బంప్స్ కూడా వ‌స్తాయ‌ని మ‌రీ చెప్పారు. ఇదో లార్జ‌ర్ దెన్ లైఫ్ మూవీ అని.. యాక్ష‌న్‌, ఎమోష‌న్‌తో పాటు విజువ‌ల్స్ నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటాయ‌న్నారు. సినిమా కోసం యేడాది పాటు అన్నీ రుతువుల్లోనూ ప‌ని చేశామ‌ని.. సంక్రాంతికి ఈ సినిమా అస‌లు సిస‌లు విన్న‌ర్ అవుతుంద‌ని చెప్పేశారు.

ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ కూడా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేశారు. సినిమా స‌మ‌ర‌సింహారెడ్డి రేంజ్‌లో ఉంటుంద‌ని.. రికార్డులు రాసిపెట్టుకోండంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఏదేమైనా ఈ సినిమాకు ప‌నిచేసిన వీరు ముగ్గురు కాన్ఫిడెంట్ ఇచ్చిన రివ్యూల‌తో ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొద‌ల‌య్యాయి. మ‌రి బొమ్మ ఏ రేంజ్‌లో ఉంటుందో ? బాల‌య్య విజృంభ‌ణ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news