Moviesమహేశ్ బాబు తో సినిమాకి అలాంటి కండీషన్ ..పొట్టి పిల్ల శ్రీలీలకు...

మహేశ్ బాబు తో సినిమాకి అలాంటి కండీషన్ ..పొట్టి పిల్ల శ్రీలీలకు పొగరు ఎక్కువే..!?

ఎస్ ప్రజెంట్ అందరూ ఇదే మాటతో శ్రీలీల చేసిన పనికి షాక్ అవుతున్నారు . మనకు తెలిసిందే పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల . టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . పెళ్లి సందడి సినిమాతో యువత మనసును దోచిన శ్రీ లీల .. ధమాకా సినిమాతో మాస్ జనాల మనసులు కూడా దోచేసింది .

ఈ సినిమాలో శ్రీ లీల చేసిన మాస్ పెర్ఫార్మెన్స్ ..చెప్పిన మాస్ డైలాగ్స్ జనాలకు ఎంత విపరీతంగా నచ్చేసాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . థియేటర్స్ లో రవితేజ బొమ్మ పడితే విజిల్స్ ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో.. దానికి డబుల్ రేంజ్ లో శ్రీ లీల జింతాక్క సాంగ్ చేస్తున్నప్పుడు అరుపులు కేకలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది . అంతలా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది శ్రీ లీల . కాగా రీసెంట్ గానే ధమాకా సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది .

ఈ క్రమంలోని శ్రీలీల పేరు మరింత హైలెట్గా మారింది . అయితే తన క్రేజ్ రేంజ్ పెరిగిపోవడంతో శ్రీ లీల ఉన్నపలంగా రెమ్యూనరేషన్ ట్రిపుల్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు కోటి రూపాయలు అందుకుంటున్న శ్రీలీల..మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట . ఈ క్రమంలోనే శ్రీ లీల హెడ్ వెయిట్ చూసిన త్రివిక్రమ్ షాక్ అయ్యాడని.. ఈ కారణంగానే సినిమా నుంచి ఆమెను తీసేసాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు శ్రీ లీల సైతం మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకోవడం పట్ల ఏం మాత్రం ఫీల్ అవ్వట్లేదట . దీంతో పొట్టి పిల్లలకు పొగరెక్కువే అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news