Moviesశ్రీలీల పేరు చెపితేనే మండి ప‌డుతోన్న పూజా.. అస‌లేం జ‌రిగింది...!

శ్రీలీల పేరు చెపితేనే మండి ప‌డుతోన్న పూజా.. అస‌లేం జ‌రిగింది…!

కొద్ది రోజుల వ‌ర‌కు టాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవ‌రు ? అంటే ఠ‌క్కున వినిపించే పేరు పూజా హెగ్డే. అస‌లు పూజాను స్టార్ హీరోయిన్‌ను చేసిందే టాలీవుడ్ ఇండ‌స్ట్రీ. ఆమె ముందుగా కోలీవుడ్‌లో జీవా ప‌క్క‌న మాస్క్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమా ప్లాప్‌. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత తెలుగులో నాగ‌చైత‌న్య ఒక లైలా కోసం, వ‌రుణ్ తేజ్ ముకుంద సినిమాల్లో న‌టించింది.

అస‌లు ఈ రెండు సినిమాలు కూడా ఓ మోస్త‌రుగానే ఆడాయి. ఆ త‌ర్వాత ఆమె న‌క్క తోక తొక్కేసింది. వ‌రుస‌గా స్టార్ హీరోలు, స్టార్ ద‌ర్శ‌కుల సినిమాల్లో జోడీ క‌ట్టేసి సూప‌ర్ హిట్లు కొట్టేసింది. బ‌న్నీతో డీజే, అల వైకుంఠ‌పురంలో, ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత‌, మ‌హేష్‌తో మ‌హ‌ర్షి, ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా, చ‌ర‌ణ్‌తో ఆచార్య ఇలా అంద‌రు హీరోల‌తోనూ సూప‌ర్ హిట్లే చేసింది.

అయితే క్రేజ్ ఉంది క‌దా ? అని మ‌రీ కొండ‌క్కేయ‌డంతో ఇప్పుడు ఆమెకు అంతా రివ‌ర్స్ అవుతోంది. దీనికి తోడు శ్రీలీల రూపంలో టాలీవుడ్‌లో ఆమె హ‌వాకు పెద్ద గండ‌మే పొంచి ఉంది. అలాగే ర‌ష్మిక కూడా పూజా ఛాన్సుల‌కు గండి కొడుతోంది. ఇదిలా ఉంటే పెళ్ళి సందD – ధమాకా హిట్ల‌తో ఫుల్‌స్వింగ్‌లో ఉన్న శ్రీలీల ఇప్పుడు ఏకంగా మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

శ్రీలీల క్యూట్ అందాలు ఇప్పుడు తెలుగు నాట పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి. త్రివిక్ర‌మ్ కూడా మ‌హేష్ – శ్రీలీల మ‌ధ్య అదిరిపోయే ఫోక్ సాంగ్ కూడా సెట్ చేయించాడ‌ట‌. ఇప్పుడు థ‌మ‌న్‌తో కూడా ఈ ట్యూన్ ద‌గ్గ‌రుండి మ‌రీ చేయిస్తున్నాట్ట త్రివిక్ర‌మ్‌. ఇదంతా శ్రీలీల మ‌హ‌త్య‌మే అంటున్నారు. అయితే ముందుగా పూజా హెగ్డేకు చెప్పిన క‌థ‌కంటే ఇప్పుడు శ్రీలీల పాత్రకు స్కోప్ పెరిగిపోవ‌డంతో పూజా హెగ్డే ఏం అన‌లేక లోలోన రుస‌రుస‌లాడిపోతోంద‌ట‌.

ప్ర‌స్తుతం పూజా ప‌రిస్థితి బాగోలేదు. వ‌రుస ప్లాపుల్లో ఉంది. ఇలాంటి టైంలో బెట్టు చేసి ఈ సినిమా చేయ‌ను అనే ప‌రిస్థితి లేదు. పైగా మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సినిమా. అందుకే సన్నిహితుల వ‌ద్ద ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా శ్రీలీల క్రేజ్‌ టాలీవుడ్‌లో చాలా మందికి మంట పెట్టించేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news