Moviesవీళ్లలో నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!!

వీళ్లలో నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే మనకంటూ ఓ హీరో ని ఇష్టంగా లైక్ చేస్తూ ఉంటాం. మనకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే నాన్న హంగామా చేస్తూ సందడి చేస్తాం. ప్రతి అభిమానికి తన ఫేవరెట్ హీరోనే నెంబర్ వన్ అంటూ అనుకుంటూ ఉంటారు . ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ 2022 గాను టాలీవుడ్ స్టార్స్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియుల అభిప్రాయాల ఆధారంగా ఎవరి స్టార్డం, పాపులారిటీ ఏమిటో తెలియజేశారు. ఆర్మాక్స్ ప్రతి నెనా ప్రముఖ చిత్ర పరిశ్రమలు,టెలివిజన్ ఇండస్ట్రీస్ కి చెందిన స్టార్స్ పై సర్వే చేసింది.

అయితే రీసెంట్ గా ఆర్మాక్స్ రిలీజ్ చేసిన తాజా సర్వేలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో తెలిసిపోయింది . మనకు తెలిసిందే ఆర్మాక్స్ సంస్థ ప్రతినెల వివిధ కేటగిరీల్లో హీరో హీరోయిన్లు ఎవరు ముందు స్థానంలో ఉన్నారు.. ఎవరికి ఏ ర్యాంకింగ్ లో ఉన్నారు అంటూ సర్వే చేస్తూ ఉంటుంది . తాజాగా ఆర్మాక్స్ రిలీజ్ చేసిన డిసెంబర్ 2022 టాలీవుడ్ స్టార్ హీరోస్ లలో మొదటి స్థానంలో నిలిచాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ .

నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సహో, రాధే శ్యామ్ డిజాస్టర్ గా మారాయి. అయినా కానీ ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానాన్ని ప్రభాస్ దక్కించుకొని సంచలనాన్ని క్రియేట్ చేశారు . కాగా రెండవ స్థానంలో ఎన్టీఆర్ ..మూడవ స్థానంలో బన్నీ సరిపెట్టుకున్నారు. ఇక తర్వాత స్థానంలో రామ్ చరణ్ ,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని , విజయ్ దేవరకొండ, చిరంజీవి దక్కించుకున్నారు . చిరంజీవి ఈ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించిన ఓన్లీ సీనియర్ హీరో కావడం విశేషం..!!

Latest news